Bharatha Sakthi

2 కోట్ల గంజాయి, డ్రగ్స్‌ కాల్చివేత

Bharath Sakthi 08/01/2025
Updated 2025/01/08 at 6:41 PM

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), జనవరి 06:

మధిర, నేలకొండపల్లి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 91 కేసుల్లో పట్టుబ డిన 831 కేజీల గంజాయి, 11గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను గోపాల్‌ పేట్‌ గ్రామం, తల్లేడ మండలంలో ప్రభుత్వ అమోదిత ఏ డబ్ల్యు ఎం కన్సటింగ్‌ లిమిటేడ్‌లో సోమవారం కాల్చివేశారు.

డిస్పోజల్‌ అధికారి ఖమ్మం డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి అదేశాల మేరకు రూ. 2 కోట్ల విలువ చేసే గంజాయి, డ్రగ్స్‌ను దాహనం చేశారు.

డ్రగ్స్‌ను కాల్చివేసిన అధికారుల్లో డిప్యూటి కమిషనర్‌ జి . జనార్థన్‌రెడ్డి అసిస్టేంట్‌ కమిషనర్‌ జి .గణేష్‌, డీసీఈఓ నాగేందర్‌రెడ్డి,ఎస్‌హెచ్‌ఓలు పాల్గన్నారు.

గంజాయి, డ్రగ్స్‌ను కాల్చివేసిన ఎక్సైజ్‌ అధికారులను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందిచారు.

Share this Article