గుంటూరు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో బుధవారం రాత్రి రైస్ మిల్లులో పిడిఎఫ్ రైస్ లారీలో తరలిస్తున్నారన్నా సమాచారంతో పత్తిపాడు సిఐ, సివిల్ సప్లై డీఎస్‌ఓ పద్మజ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేసి లారీలో ఉన్న 12 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వట్టి చెరుకూరు రెవెన్యూ ఆర్ ఐ ఆధ్వర్యంలో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కు లారీని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Leave a comment