Bharatha Sakthi

Rolex కోసం రోలెక్స్ గిఫ్ట్.. సూర్యకు కమల్ హాసన్ కాస్ట్‌లీ బహుమతి

admin 09/06/2022
Updated 2022/06/09 at 2:43 AM

కమల్ హాసన్ (kamal haasan) తాజాగా సూర్య(suriya)కు తాను పోషించిన రోలెక్స్ పాత్ర(rolex role in vikram movie)కు తగ్గట్టుగా రోలెక్స్ వాచ్‌(rolex watch)ని గిఫ్ట్ ఇచ్చాడు. విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కమల్ హాసన్ ఫుల్ ఖుషీ మీదున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాకు పెట్టిన ఖర్చు అంతా కూడా మూడు రోజుల్లోనే వచ్చింది. విక్రమ్ సినిమా కమల్ హాసన్‌కు లాభాల పంట పండిస్తోంది. అందుకే కమల్ హాసన్ గిఫ్టుల మీద గిఫ్టులు ఇస్తున్నాడు. నిన్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌కు కాస్ట్ లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక ఇప్పుడు సూర్యకు విలువైన బహుమతిని ఇచ్చాడు.

సూర్య చేతికి ఉన్న ఈ వాచ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది ఏ మోడల్, ధర ఎంత అయి ఉంటుందని అందరూ వెతుకుతున్నారు. ఇది Rolex Day-Date 40 Rose Gold President మోడల్ అని తెలుస్తోంది. దీని ధర సుమారు 62 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి సూర్యకు మాత్రం ఇలా తన ప్రేమను వ్యక్త పరిచాడు కమల్ హాసన్. నిన్న ఓ వీడియోను రిలీజ్ చేసిన కమల్ హాసన్.. అందులోనూ సూర్య గురించి ప్రత్యేకంగా ప్రస్థావించాడు.

చివరి మూడు నిమిషాలు దడదడలాడించేశాడని, తన మీద ప్రేమతోనే ఈ రోల్ చేశాడంటూ సూర్య గురించి కమల్ హాసన్ ఎంతో గొప్పగా చెప్పేశాడు. ఇక వచ్చే సినిమాలో తామిద్దరం కలిసి నటించబోతోన్నట్టు ప్రకటించేశాడు. మొత్తానికి విక్రమ్ సినిమా కోసం అయితే సూర్య రెమ్యూనరేషన్ తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. కానీ కమల్ హాసన్ మాత్రం ఇలా బహుమతి రూపేణా సూర్యకు చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చేశాడు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *