సంగారెడ్డి ప్రతినిధి, భారత శక్తి:
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని మైత్రి ఫౌండేషన్ ఫౌండర్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ ఆదివారం మండలంలోని 350 మంది అడ్డా కూలీలకు తన జన్మదినం సందర్భంగా అల్పాహారాన్ని పండ్లను పంపిణీ చేశారు. అనంతరం చంచల్గూడా జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివ కుమార్ గౌడ్ సహకారంతో మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కొరకు అన్నారం గ్రంథాలయనికి పుస్తకాలను ఫౌండర్ ఉదయ్ కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.