Bharatha Sakthi

చిన్నారుల అక్రమ రవాణా నిరోదించటమే ద్యేయం

admin 07/08/2022
Updated 2022/08/07 at 6:50 AM

కోవిడ్ 19 తో నిరుపేదల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.భారతదేశం యొక్క దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో మానవ అక్రమ రవాణాకు సుంభదించిన మూలాలు బలంగా వున్నాయి.ఈ రాష్ట్రలు దీనికి ప్రధాన కేంద్రాలుగా మారాయి.
ఇటీవల విడుదల చేసిన నేషనల్ రికార్డ్స్ బ్యూరో (నేషనల్ చైల్డ్ రికార్డ్స్) 2020 డేటా ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్రాష్ట్రాలు మానవ అక్రమ రవాణాలో వరుసగా 184, 171 కేసులతో రెండు, మూడు స్థానాల్లో ఉండగా మహారాష్ట్రం మొదటి స్థానంలో వుంది. అక్రమ రవాణాకు గట్టిన పిల్లల సంఖ్యను అమాకి తెలియని తప్పిపోయిన పిల్లల సంఖ్యతో పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాచేస్తే ఈజరురాష్ట్రాలలో అక్రమ రవాణా యొక్క ప్రాబల్యం వెలుగులోకి వస్తుంది.
2019లో పోలిస్తే 2020లో ఆంధ్రప్రదేశ్ లో అచూకీ తెలియని తప్పిపోయిన పిల్లల సంఖ్య 15 శాతం (549 నుంచి
636కు) పెరిగిందని, అలాగే తెలంగాణలో 19 శాతం (655 నుంచి 777 కు) పెరిగిందని నేషనల్ చైల్డ్ రికార్డ్స్ 2020 నివేదిక తెలిపింది.పిల్లల అక్రమ రవాణా సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా.క్రై సంస్థ తన భాగస్వామ్య సంస్థ అయిన ఏఫోర్ట్ సంస్థ తో కలిసి ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలం లో అన్ని
గ్రామాలలో వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది అందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలకు
మరియు సంబంధిత ప్రభుత్వ సిబ్బందికి మానవ అక్రమ రవాణా పై అవగాహన కల్పించనున్నారు. దీని ద్వారా
ఎన్జీవో సేవా సంస్థలు ప్రజలు ప్రభుత్వం కలిసికట్టుగా మానవ అక్రమ రవాణా కు వ్యతిరేకంగా పనిచేయాలని ఏఫోర్ట్ – క్రై.సంస్థ భావిస్తోంది. ఈ అవగాహన కార్యక్రమాలు జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని.వివిధ ప్రాంతాలలో నిర్వహించబడుతాయి. చైల్డ్ రైట్స్ అండ్ యు (క్రై) డెవలప్ మెంట్ సపోర్ట్ జనరల్ మేనేజర్ పీటర్ సునీల్ బాబు ఈ క్యాంపేన్ పై మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా క్రై సంస్థ దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాలలో పిల్లల రక్షణ కోసం పని చేస్తోందని తెలిపారు. అలాగే మానవ అక్రమ రవాణాకు దక్షిణాది రాష్ట్రాలను ప్రధాన కేంద్రాలుగా
వినియోగించుకుంటున్నారన్నారు.పిల్లల ప్రాధమిక హక్కులను కాలరాస్తూ, భవిష్యత్తును దోపిడీ చేసి వారిని ప్రమాదకర వృత్తుల వైపు నెట్టి వేయడం లైంగిక దోపిడికి గురి చేయడం మరియు బాల కార్మికులుగా మారుస్తున్నారు. అందువల్ల, పిల్లల అక్రమ రవాణా సమస్యను పరిష్కరించడానికి ప్రధానంగా ఈ సమస్యపై అవగాహన పెంపు కోసం మరింత దృష్టి సారించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికోసం స్థానిక ప్రజలతో మరియు ప్రభుత్వ వ్యవస్థలతో సన్నిహితంగా పని చేయడం. ద్వారా సమగ్రవిధి విధానాలను రూపొందించాలని తెలిపారు.క్యాంపేన్ లో భాగంగా నిర్వహించబడే వివిధ కార్యకలాపాలను బాల బాలికల సంఘాలు, కిషోర బాలికల సంఘాలలో పిల్లల అక్రమ రవాణా సమస్యపై అవగాహన కల్పించి జాగ్రత్తలు చెప్పడం, పాఠశాలల్లో పిల్లల అక్రమ రవాణాపై ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (ఐ ఈ సి) మెటీరియల్స్ పంపిణీ చేయాలని ఏఫోర్ట్-క్రై సంస్థ భావించింది. జిల్లా స్థాయిలో. లతో కన్వర్జెన్స్ సమావేశం పిల్లల అక్రమ రవాణా సమస్యపై పేరెంట్స్ గ్రూష్, సీబీఓలు, విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు (విసిపిసి) వారి సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు పోలీసు, మహిళా శిశు సంక్షేమశాఖ (డబ్ల్యూసిడి).మరియు పంచాయతీ సిబ్బంది కోసం సామర్ఢ్య నిర్మాణ కార్యకలాపాలు బాలల అక్రమ రవాణా సమస్య పై ర్యాలీలు కళాజాతరలు.నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ద్వారా పిల్లల అక్రమ రవాణా పోస్టల్ విడుదల చేయనున్నారు ఈ సందర్భంగా ఏఫోర్ట్ సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా క్రై సంస్థ సహాయం తో ఈ సమస్యను పరిష్కరించడానికి బాధ్యత వహించే అన్ని సంబంధిత సంస్థలతో పిల్లల అక్రమ రవాణా పై బోనకల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో అవగాహన కల్పించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము ఈ విషయం పై కిశోరా బాలికలు మరియు తల్లిదండ్రుల కు మాత్రమే కాకుండా తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ లోని పోలీస్ జిల్లా గ్రామ మరియు బ్లాక్ స్థాయి అధికారులతో సహా మొదటి ప్రతిస్పందన దారులలో సామర్ధ్యాలను పెంపొందించటం గురించి కూడా కృషి చేస్తున్నాము అని ఒక ప్రకటన తెలియజేసారు.

Share this Article