2 కిలోమీటర్ల జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి అజయ్
నా జీవితంలో మరుపురాని సంఘటన ఈ వజ్రోత్సవాలు- మంత్రి పువ్వాడ
ఖమ్మం జిల్లాలో ముఖ్యఅతిథిగా పాల్గొవడం నా పూర్వజన్మ సుకృతం -పువ్వాడ అజయ్
ఖమ్మం బ్యూరో భారత శక్తి
స్వతంత్ర భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను ఆగస్ట్ 8వ తేదీ నుండి 22 వరకు వైభవోపేతంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం నగరం జడ్పీ సెంటర్ నుండి 10 వేల మందితో రెండు కిలమీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పూడజై మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ఇది నా జీవితంలో మరుపురాని సంఘటన అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ వల్లే ఈ జిల్లా అని అభివృద్ధి పథంలో నడిపించడంలో విజయం సాధిస్తున్నామని మంత్రి అజయ్.అన్నారు.కార్యక్రమంలో ఎంపి వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ తాత మధు , మేయర్ పునుకొల్లు నీరజ , విత్తనాభివృద్ది సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి , మధుసుదన్ , కార్పొరేటర్లు, అధికారులు తదితరులు ఉన్నారు.