పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్, మారేష్ స్నేహితులు. విజయ్‌కు కొంతకాలం క్రితం వివాహమైంది. అయితే తన భార్యతో మారేష్ అక్రమసంబంధం పెట్టుకున్నాడని విజయ్ (Vijay) అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఓ సారి మాట్లాడుదామని మారేష్‌ను (Maresh) విజయ్ స్థానికంగా ఉండే అడవికి పిలిచాడు. అక్కడ అక్రమ సంబంధం గురించి మారేష్‌ను విజయ్ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ వాగ్వాదం తీవ్ర రూపు దాల్చడంతో సహనం కోల్పోయిన విజయ్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో(Knife) మారేష్ గొంతుకోశాడు. అంతటితో ఆగకుండా రక్త పిశాచి మాదిరిగా మారేష్ గొంతు నుంచి కారుతున్న రక్తాన్ని తాగాడు. అంతేకాకుండా మారేష్‌ను చెంపదెబ్బలు కొట్టాడు. ఈ ఘటనను విజయ్‌తో అక్కడికి వచ్చిన జాన్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు.అయితే విషయం పోలీసుల దాకా వెళ్లడంతో నిందితుడు విజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కెంచర్లహళ్లి పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇక ప్రాణాలతో బయటపడిన మారేష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.