కోదాడ జూలై 2:
తెలంగాణ రాష్ట్ర మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ కార్యవర్గాన్ని ఆదివారం షాదీఖానాలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కల్పనా రెడ్డి హాజరయ్యారు. కాగా కోదాడ నియోజకవర్గ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ అధ్యక్షులుగా ఈర్ల. వాసుదేవ్, వర్కింగ్ ప్రెసిడెంట్. నిజాముద్దీన్, ప్రధాన కార్యదర్శి. వీరబాబు, బ్రహ్మారెడ్డి, ఉపాధ్యక్షురాలు లతీఫ్ బి.తదితర కార్యవర్గాన్ని సభ్యులందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు, కార్యవర్గం శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ సభ్యులందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు సహాయ,సహకారాలు అందజేసుకుంటూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు యాదగిరి, ఉపాధ్యక్షులు యాకుబ్ ఆలీ, ప్రధాన కార్యదర్శి.నల్లవోలు కృష్ణారెడ్డి,గౌరవ సలహాదారులు నర్రాల. రుక్క రావు,వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మల్ల. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు……..