న్యూఢల్లీి, జూలై 7
అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిజాన్ని దాచి పెట్టాడు. తర్వాత అరెస్టై జైల్లో ఉన్నాడు. ఎట్టకేలకు నిజాన్నయితే ఒప్పుకున్నాడు. కానీ.. ఆ హత్య చేసిన తర్వాత డెడ్‌బాడీని ఎక్కడ పాతిపెట్టాడో కనిపెట్టడానికి పోలీసులకు చాలా రోజులు పట్టింది. ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన జాస్మిన్ కౌర్ కేసులో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆమెను పాతిపెట్టిన ప్లేస్‌ను గుర్తించిన పోలీసులు.. ఈ ఉన్మాద ఘటన జరిగిన తీరు చూసి షాక్ తిన్నారు.భారత సంతతి యువకుడు తారిక్‌జ్యోత్ తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌ను అత్యంత కిరాతకంగా 2021లో హత్య చేశాడు. ఆమె కళ్లకు గంతలు కట్టి.. కాళ్లూచేతుల్ని కేబుల్స్‌తో కట్టేసి.. బతికుండగానే నిప్పంటించి.. సజీవంగానే పాతిపెట్టేశాడు. తన ప్రేమను కాదంది అనే ఒకే ఒక్క కారణంతో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఈ హత్య ఫ్లిండర్స్ రేంజెస్ ప్రాంతంలో జరిగింది. జాస్మిన్ మిస్సింగ్‌పై విచారణ చేసిన పోలీసులు చివరికి తారిక్‌జ్యోత్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. చివరికి అతనే నేరస్తుడని తేల్చారు. ఫిబ్రవరిలోనే నేరం రుజువైంది. తారిక్‌జ్యోత్ నేరం ఒప్పుకున్నాడు. కానీ ఆమెను పాతిపెట్టిన స్థలం కనిపెట్టేందుకు ఇన్ని రోజులు పట్టింది. ఆ ప్రాంతంలో నుంచి డెడ్‌బాడీ బయటకు తీసేప్పుడు ఎంత క్రూరంగా ఈ హత్య చేశాడో వెలుగు చూసింది.పంజాబ్‌కు చెందిన జాస్మిన్ నర్సింగ్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడే తారిక్‌జ్యోత్ పరిచయం అయ్యాడు. తర్వాత అతని వికృత ప్రవర్తన నచ్చక దూరం పెట్టింది. ఈ కసితో రగిలిపోయి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తమ కుమార్తె హత్యకు గురైందన్న బాధనుంచి ఆ కుటుంబం ఇంకా తేరుకోలేకపోతోంది. దాదాపు 100 సార్లు అతని ప్రేమను నిరాకరించినా వెంటపడి వేధించి చివరికి ప్రాణం తీశాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Leave a comment