Bharatha Sakthi

రష్యా నుంచి భారీగా గోధుమల దిగుమతి…

admin 18/08/2023
Updated 2023/08/18 at 7:42 AM

న్యూఢల్లీి, ఆగస్టు 18
రష్యా నుంచి తక్కువ ధరకే గోధుమలు దిగుమతి చేసుకునే పనిలో పడిరది భారత్‌. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాలో అంతరాయం కలిగింది. ఈ దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ ప్రభావం పడిరది. ముఖ్యంగా భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవాలంటే డిమాండ్‌కి తగ్గట్టుగా సరఫరా ఉండాలి. అందులోనూ వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలున్నాయి. ఇలాంటప్పుడే ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది మోదీ సర్కార్‌. అందులో భాగంగానే రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు ప్లాన్‌ చేస్తోంది. ప్రైవేట్‌ ట్రేడ్‌ ద్వారా అయినా, లేదంటే రెండు ప్రభుత్వాలు అధికారికంగా ఒప్పందం చేసుకునైనా గోధుమలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఇప్పటికే రష్యాతో చర్చలు మొదలైనట్టు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జులై రికార్డు స్థాయి ధర పలికాయి గోధుమలు. గత 15 నెలల్లో ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగాయి. నిజానికి గోధుమలు దిగుమతి చేసుకునేందుకు భారత్‌ ఎప్పుడూ దౌత్య చర్చలు జరపలేదు. చివరిసారిగా 2017లో ఆ అవసరం వచ్చింది. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆధార పడుతోంది. గోధుమల ధరలు తగ్గితే క్రమంగా మిగతావన్నీ అదుపులోకి వస్తాయని భావిస్తోంది. పప్పు ధరలూ తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికైతే దీనిపై అధికారులు స్పందించడం లేదు. మరి కొద్ది వారాల్లోనే ఈ డీల్‌ కుదురుతుందని సమాచారం. అయితే…కొందరు అధికారులు మాత్రం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పుడున్న కొరతను తీర్చేందుకు 3`4 మిలియన్ల మెట్రిక్‌ టన్నుల గోధుమలు అవసరం పడతాయి. కానీ భారత్‌ ఏకంగా 8`9 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గోధుమల్ని దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తరవాత భారత్‌కి భారీ మొత్తంలో గోధుమలు పంపించింది రష్యా. ఆహార అవసరాలు తీర్చేందుకు ఆసక్తి చూపిస్తోంది. గోధుమలతో పాటు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ని కూడా దిగుమతి చేసుకుంటోంది ఇండియా. చెల్లింపులను యూఎస్‌ డాలర్లలో చేస్తోంది. ఇప్పుడు కూడా అదే తరహాలో పెద్ద మొత్తంలో గోధుమలు దిగుమతి చేసుకునే అవకాశముంది. టన్నుకి 25`40 డాలర్ల చొప్పున రష్యా డిస్కౌంట్‌ ఇవ్వనుందని తెలుస్తోంది. తద్వారా దేశీయంగా ధరలు తగ్గుతాయి. రెండు నెలల్లోనే గోధుమల ధరలు గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి భారత్‌లో 28.3 మిలియన్‌ టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయి. ప్రపంచంలో గోధుమలను ఉత్పత్తి చేసే రెండో అతి పెద్ద దేశం భారతదేశం. అయితే, దేశీయ మార్కెట్‌లో గోధుమల అందుబాటులో లేక ధరలు ఒక్కసారిగా పెరగడంతో, గోధుమల ఎగుమతిపై నిషేధం విధిస్తూ 2022 మే నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అకాల వర్షాల కారణంగా గోధుమ పంటకు నష్టం వాటిల్లడంతో, గోధుమల సేకరణల్లో నాణ్యత నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, చండీగఢ్‌ రాష్ట్రాల్లో రైతులకు కోసం నిబంధనల మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *