Bharatha Sakthi

చంద్రయాన్‌ పై భారత్‌ ఆశలు

admin 22/08/2023
Updated 2023/08/22 at 10:28 AM

శ్రీహరికోట, ఆగస్టు 22
యావత్‌ ప్రపంచం ఆగస్టు 23 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు ప్రయోగించిన ‘చంద్రయాన్‌`3’ ప్రయోగం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. చంద్రుడిపై అడుగుపెట్టే ఘడియలు దగ్గరపడుతున్నా కొద్దీ మరింత ఆసక్తి పెరగుతోంది. చంద్రుడిపై నమూనాలను సేకరించేందుకు ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండ్‌ కావాలని అంతా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రష్యా ప్రయోగించిన ‘లూనా`25’ ప్రయోగం విఫలం కావడంతో చంద్రయాన్‌`3పై అందరి దృష్టిపడిరది. ల్యాండిరగ్‌ కనుక విజయవంతమైతే అంతరిక్ష చరిత్రలో భారత్‌ సరికొత్త రికార్డు నిలిపిన దేశంగా మారనుంది.ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌`3 ల్యాండర్‌ మాడ్యూల్‌.. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ నుంచి ఇప్పటికే విడిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఇస్రో సోమవారం కీలక ప్రకటన చేసింది. 2019 జూలై 22న ఇస్రో చంద్రయాన్‌`2 ఆర్బిటర్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్బిటర్‌ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తోన్నంది. ఈ ఆర్బిటర్‌తో చంద్రయాన్‌`3కి చెందిన ల్యాండర్‌ మాడ్యుల్‌ను విజయవంతంగా అనుసంధానించినట్లు ఇస్రో ట్వీట్‌ చేసింది. చంద్రయాన్‌ 3 ల్యాండర్‌ మాడ్యుల్‌కు చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌ స్వాగతం పలికిందన్నది ఆ ట్వీట్‌ సారాంశం.స్వాగతం.. మిత్రమా! చంద్రయాన్‌`2 ఆర్బిటర్‌.. చంద్రయాన్‌`3 ల్యాండర్‌ మాడ్యుల్‌ను స్వాగతిస్తోంది. ప్రస్తుతం ఈ రెండిరటి మధ్య పరస్పర సమాచార మార్పిడి జరుగుతోంది. డేటాను ఎక్స్ఛేంజ్‌ చేసుకుంటున్నాయి. ల్యాండర్‌ మాడ్యుల్‌ను చేరుకునేందుకు బెంగళూరులోని ఇస్ట్రాక్‌ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయి.. అని ఇస్రో ట్వీట్‌ చేసింది.ఆగమేఘాల విూద రష్యా లూనా ప్రయోగించింది. దాంతో రష్యా ప్రయోగించిన లూనా 25 చంద్రుడిపై కూలిపోయింది. దాంతో ప్రపంచం దృష్టి చంద్రయాన్‌ 3 పై మళ్లింది. ఆచితూచి చంద్రుడి కక్ష్యను చేరుకున్న చంద్రయాన్‌ 3. సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ చేయగలమనే ధీమాతో ఇస్రో సైంటిస్టులు ఉన్నారు. రష్యా చంద్రుడిపైకి పంపించిన లూనా 25 చంద్రుడిపైన కుప్పకూలి పోవటంతో మన ఇస్రో శాస్త్రవేత్తల్లోనూ టెన్షన్‌ మొదలైంది. వాస్తవానికి చంద్రయాన్‌ 3 ని కేవలం 600 కోట్ల రూపాయల బడ్జెట్‌ లో తయారు చేసి పంపించిది ఇస్రో. అది కూడా స్లింగ్‌ షాట్‌ పద్ధతిలో భూమి చుట్టూ గురుత్వాకర్షణ నుంచి బయటపడి.. చంద్రుడిని చేరుకుని అక్కడా ఇలానే కక్ష్యను తగ్గించుకుంటూ చంద్రుడి దక్షిణ ధృవంపై దిగేందుకు ప్లాన్‌ చేసింది. రష్యా అలా చేయలేదు. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆగస్టు 11న రాకెట్‌ ను ప్రయోగించింది. ఆగస్టు 21న అంటే కేవలం పదంటే పదిరోజుల్లో చంద్రుడి సౌత్‌ పోల్‌ విూద ల్యాండర్‌ ను సేఫ్‌ గా జాబిల్లిపై దించాలని భావించింది. కానీ బ్యాడ్‌ లక్‌. అతి తక్కువ సమయంలో ప్రయోగం సక్సెస్‌ చేయాలనుకోవడమో, లేక భారత్‌ కంటే ముందుగా చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ చేసి తొలి దేశంగా అరుదైన ఘనత సాధించాలనుకోవడం రష్యా శాస్త్రవేత్తలు చేసిన తప్పిదంగా కనిపిస్తోంది. లూనా 25 సాంకేతిక సమస్యలతో చంద్రుడిపై ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టి క్రాష్‌ అయిపోయింది.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *