హైదరాబాద్, ఆగస్టు 23
ముంబయి తర్వాత హైదరాబాద్ అత్యధిక రియల్ మార్కెట్ వృద్ధి నమోదు చేసింది. 2023 ప్రథమార్థంలో గత ఏడాదితో పోలిస్తే ఒక శాతం అధికంగా వృద్ధి నమోదు అయింది.హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం 31 శాతం నిష్పత్తితో హైదరాబాద్ దేశంలో రెండో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ అని తేలింది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో గత ఏడాదితో పోలిస్తే (30 శాతం) 1 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది 53 శాతం నుంచి ప్రస్తుతం 55 శాతం వృద్ధితో ముంబయి మొదటి స్థానంలో ఉంది. నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక ప్రకారం దేశ రాజధాని దిల్లీలో 30 శాతం వృద్ధి రేటు నమోదు అవ్వగా, బెంగళూరు 29 వృద్ధి నమోదుతో తర్వాత స్థానంలో ఉంది.2023లో గృహ రుణాల వడ్డీ రేట్లు అధికంగా ఉండడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లలో కాస్త జోరు తగ్గిందని నివేదిక పేర్కొంది. దేశంలోని ఎనిమిది నగరాల్లో అహ్మదాబాద్ అత్యంత సరళమైన గృహ మార్కెట్ మొదటి స్థానంలో ఉండగా, 23 శాతంతో పూణే రెండో స్థానంలో ఉండగా, తర్వాత 26 % తో కోల్ కతా రియల్ మార్కెట్ ఉంది. అఫర్డబిలిటీ ఇండెక్స్ ఇఓఎ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్), సగటు కుటుంబం ఆదాయ నిష్పత్తిని ట్రాక్ చేసింది. ఈ సర్వేలో దేశంలోని ఎనిమిది నగరాల్లో 2010 నుంచి 2021 వరకు స్థిరమైన అభివృద్ధిని సాధించింది. ముఖ్యంగా మహమ్మారి సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఖీఃఎ) గృహ రుణ రేట్లు తగ్గించింది.పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు ఆర్బీఐ రేపో రేటును 250 బెసిస్ పాయింట్స్ పెంచింది. దీంతో ఈ ఎనిమిది నగరాల్లో సగటున 2.5 శాతం అఫర్డబిలిటీ తగ్గింది. ఈఎంఐ లోడ్ కూడా 14.4 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం ఇప్పటివరకు గతంలో కంటే రియల్ మార్కెట్ అధిక డిమాండ్ కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. రూ.50 లక్షల లోపు టిక్కెట్ సైజు కేటగిరీలో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. కొనుగోలుదారులు గృహ రుణాలపై చాలా ఎక్కువ ఆధారపడుతున్నారు.ఈ విభాగంలో డిమాండ్‌ను తగ్గడానికి ఇది ముఖ్యమైన అంశం. మిడ్`సెగ్మెంట్‌లోని అమ్మకాలు ఇప్పుడు అఫర్డబిలిటీ సెగ్మెంట్‌ను మించిపోతున్నాయి. అయితే ప్రీమియం విభాగంలో రేట్లు వేగంగా పెరుగుతాయి.’’రెసిడెన్షియల్ మార్కెట్లో మిడ్, ప్రీమియం విభాగాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. మార్కెట్ ఇంటర్నల్ గా గణనీయమైన మార్పును సూచిస్తున్నాయి. అయినప్పటికీ పాలసీ రేట్లలో 250 పజూబ పెరుగుదల మార్కెట్లలో సగటున 2.5 శాతం కొనుగోలు సామర్థ్యాన్ని తగ్గించింది. మరింత వడ్డీ రేటు పెంపుదల గృహ కొనుగోలుదారుల సామర్థ్యంపై ఒత్తిడిని కలిగిస్తుంది’’ అని నైట్ అండ్ ఫ్రాంక్ సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు.
Leave a comment