రాచకొండ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు భువేష్ (17), తుషార (18)లు మృతి చెందారు. మృతులు అల్వాల్ బొల్లారం ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కీసర చౌరస్తా నుండి యద్గర్పల్లి వైపు వెళ్తున్న బెలీనో కార్ దుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీ కొట్టడంతో ఘటన చోటు చేసుకుంది. కారు లో ప్రయాణిస్తున్న ఐదు మందిలో నలుగురు యువకులు భువేశ్ , తుషార లు మృతి చెందగా పిలిప్స్ , రుబిన్, యువతి హరిప్రియ లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం మద్యం సేవించి వాహనం నడపడం అని ప్రాథమిక దర్యాఫ్తు లో పోల్యీసులు వెల్లడిరచారు. కారులో మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.