హైదరాబాద్
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాపారాయుడు నగర్లో దారుణ హత్య జరిగింది. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్ ని గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. అనంతరం సెలూన్‌లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి పరారయ్యారు. రాతైనా భర్త ఇంటికి రాకపోవడంతో అతని భార్య, పిల్లలు సెలూన్‌కి వెళ్లి చూడగా.. రక్తం మడుగులో పడి ఉన్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Leave a comment