Bharatha Sakthi

బరోసా సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రినలమాద ఉత్తమ్

Bharath Sakthi 12/03/2024
Updated 2024/03/12 at 6:24 AM

సూర్యాపేట జిల్లా కేంద్రంలో సువెన్ ఫార్మా కంపెనీ ప్రక్కన పోలీసు శాఖ, సువెన్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాన్ని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళ వేదింపులు, హత్యాచారం, దాడులకు, నిరాదరణకు గురైన బాధితులకు, పిల్లకు ఒకే చోట కేసుల నమోదు, వైద్య, న్యాయ, మానసిక దైర్యం, అవసరమైన పిల్లలకు విద్యా వసతి, పునరావాసం, కౌన్సిలింగ్ ఇవ్వడం, కోర్టుల విషయాలు ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ బరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం అనే ఆలోచన చాలా మంచి విషయమని ఈ ఏర్పాటు ఆలోచన చేసిన పోలీసు శాఖను, భాగస్వామ్యమైన సు ఫార్మా ట్రస్ట్ కు ఉత్తమ్ అభినందనలు తెలిపారు మహిళల రక్షణలో పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలను, బాలలను వేదించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆదేశించారు. భౌతిక దాడులను,హత్యాచారం దాడులను అడ్డుకోవడం మన అందరి బాధ్యత, వేదింపులకు సంభందించి దైర్యంగా పిర్యాదు చేయాలని మంత్రి తెలిపినారు. బరోసా సెంటర్, శీ టీమ్స్ పని తీరు, చట్టాల అమలుపై గ్రామాల్లో అవగాహనా కల్పించాలని తెలిపినారు. జిల్లాలో గంజాయి రవాణా, అమ్మకాలను నిరోధించడంలో పోలీసు శాఖ నిరంతర కృషి చేయాలని, గంజాయి మూలలను గుర్తించి పూర్తి స్థాయిలో అరికట్టాలని, గంజాయి రహిత జిల్లాగా, గంజాయి రహిత రాష్ట్రంగా చేయండంలో బాగా పని చేయాలని అధికారులను ఆదేశించారు.ఎస్పీ బరోసా సెంటర్ యొక్క ఏర్పాటు లక్ష్యం, ఉద్దేశ్యం గురించి వివరించారు, దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీసు మహిళ అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో బరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగినది ఎస్పి గారు అన్నారు. మహిళల రక్షణగా, పిల్లల పై లైంగిక దాడుల నివారణ, నిరాదరణకు, దాడులకు గురైన మహిళలకు, పిల్లకు అండగా ఉండడం ఒకేచోట అవసరమైన అన్ని సహాయాలు అందించడం లక్ష్యమని అన్నారు. కేసులో నేరస్తునికి శిక్ష పడే వరకు, కేసు ముగిసే వరకు సపోర్ట్ పరసన్, లీగల్ అడ్వైసర్, మెడికల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెలు, జిల్లా కలక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే, స్థానిక ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ పద్మ, సువెన్ యాజమాన్యం, దామోదర్ రెడ్డి, చెవిటి వెంకన్న, వేనారెడ్డి. అదనపు ఎస్పీ లు నాగేశ్వర రావు, జనార్ధన్ రెడ్డి,డి డబ్యు ఓ వెంకటరమణ, డీసీపీ ఓ రవి కుమార్,డిఎస్ పి బరోసా సెంటర్ సిబ్బంది ఎస్ ఐ మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.

Share this Article