ఏడు లక్షల నగదు రెండు మోటార్ సైకిల్లు ఒక ఆటో 9 సెల్ ఫోన్లు మూడు నకిలీ బంగారు బిస్కెట్లు,3,80,500 చిన్నపిల్లల ఆడుకునే కరెన్సీ నోట్లు స్వాధీనం
ఐదుగురు నిందితులు అరెస్ట్
కేసు వివరాలను వెల్లడించిన డిఎస్ పి శ్రీధర్ రెడ్డి
సూర్యాపేట జిల్లా బ్యూరో(భారతశక్తి) సెప్టెంబర్ 26: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ఆవరణలో కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి సీఐ చరమంద రాజు హుజూర్ నగర్ మఠంపల్లి ఎస్సై లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం మోదుగుంట్ల గ్రామానికి చెందిన నోముల ప్రకాష్ అలియాస్ వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ మరియు నోముల మత్స్యగిరి అన్నదమ్ములు ఆత్మకూరు మండల కేంద్రంలోని ఓం సాయి ట్రేడర్స్ అనే టైల్స్ షాప్ పెట్టి వ్యాపారం చేస్తున్నారు.వ్యాపారం లో నష్టం రావడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పలనాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన
కొమెర రత్తయ్య అలియాస్ తిరుపతిరెడ్డి , పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం మాసా పాలెం కాలనీకి చెందిన బత్తుల రేణు పల్నాడు జిల్లా బెల్లంకొండ గ్రామానికి చెందిన డేరంగుల కృష్ణవేణి ఈ ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు అమాయక ప్రజలను ఎంచుకొని వారికి నకిలీ బంగారాన్ని నిజమైన బంగారంలా నమ్మించి అమ్మి డబ్బులు సంపాదించుకోవాలని పథకం పన్ని, కొమెర రత్తయ్య, రేణు సత్తెనపల్లిలో కంసాలోల్ల దగ్గర నకిలీ బంగారు బిస్కెట్లను తయారు చేపించి 2024 సెప్టెంబర్ 2న మునగాల మండలం నారాయణ గూడెం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గోపిరెడ్డి వెంకటరెడ్డి తో తమ బంధువులు కొత్త ఇల్లు కట్టాలని ఉద్దేశంతో పాత ఇల్లు కూల్చివేస్తుండగా రెండు బంగారు బిస్కెట్లు దొరికాయని తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పారు.వెంకటరెడ్డిని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ మైన్స్ కు వెళ్లే దారిలో కి తీసుకువెళ్లి కొమ్మెర రత్తయ్య నుండి నకిలీ బంగారు బిస్కెట్లు ఇస్తామని చెప్పి ప్రకాష్ చిన్న పిల్లలు ఆడుకునే కాగితపు కరెన్సీ ని తీసుకొని వెళ్లి,వెంకట్ రెడ్డి నుండి ఏడు లక్షల రూపాయలు తీసుకొని అతనికి బంగారం ఇవ్వకుండా పారిపోయారు. దీంతో వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 3న మఠంపల్లి ఎస్సై సెక్షన్ 186/2024 యు/ఎస్ 318(4)303(2)311 ఆర్/డబ్ల్యూ 3(5) బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేశారన్నారు.
జెర్రిపోతుల గూడెం గ్రామానికి చెందిన మాతంగి శీను కు కూడా బంగారం ఆశ చూపి హుజూర్నగర్ పట్టణానికి రమ్మని అతని నుండి 10,000 రూపాయలు తీసుకొని ఎంతకు శ్రీనుకు బంగారం ఇవ్వకపోవడంతో సెప్టెంబర్ 24న మాతంగి సీను హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఎస్సై ముత్తయ్య 228/2024 యు/ఎస్ 317(4) బీఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేశారు.తదుపరి హుజూర్నగర్ సిఐ చరమందరాజు పరిశోధన జరిపి సెప్టెంబర్ 26న నేరస్తులు జెర్రీపోతుల గూడెం గ్రామానికి చెందిన మాతంగి శీను కి మట్టపల్లి రోడ్డు వైపును గల భారత్ పెట్రోల్ బంకు వద్దకు డబ్బులు తీసుకుని వస్తే బంగారం ఇస్తామని చెప్పడంతో ఉదయం 11 గంటల సమయంలో నోముల ప్రకాష్,నోముల మత్స్యగిరి, కొమెర రక్తయ్యలు మాతంగి శ్రీనుకు నకిలీ బంగారం అందిస్తుండగా హుజూర్నగర్ సిఐ చరమంద రాజు చావకచక్యంగా వ్యవహరించి తమ సిబ్బందితో కలిసి నేరస్తులను పట్టుకున్నారు.పక్కా సమాచారంతో కోదాడ పట్టణంలో ఆర్కే లాడ్జిలో ఉన్న దేరంగుల కృష్ణవేణి, భక్తుల రేణులను కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుల నుండి ఏడు లక్షల నగదు రెండు మోటార్ సైకిల్ ఒక ఆటో 9 సెల్ ఫోన్లు మూడు నకిలీ బంగారు బిస్కెట్లు 761 చిన్న పిల్లలు ఆడుకునే 500 రూపాయల కరెన్సీ కాగితాలు (విలువ 3,80,500)స్వాదీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.