తిరుమలగిరి మున్సిపాల్టీ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పదవ తరగతి పరీక్షలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉపాధ్యాయులకి సూచించారు.పదవ తరగతి విద్యార్థులకి ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా స్టడీ అవర్స్ ఏర్పాటు చేయాలని వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని,చదువు లో వెనుకబడిన విద్యార్థులు కుంగి పోకుండా బాగా చదివి ఉత్తీర్ణులు అయ్యే విధంగా ప్రయత్నించాలని ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అవుతదని సూచించారు.9 వ తరగతిలో కలెక్టర్ విద్యార్థుల తెలుగు చూచిరాత కాఫీలలో రైటింగ్ మంచిగా రాస్తున్నారని మెచ్చుకున్నారు. పలువురు విద్యార్థులతో తెలుగు పాఠం చదివించగా విద్యార్థులు బాగా చదవటంతో అభినందించారు.గ్రౌండ్ లో మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్న ఆరవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చట్టిస్తు మధ్యాహ్నం భోజనం మంచిగా పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏమైనా అత్యవసర సమస్యలు ఉంటే తెలియపర్చాలని ఉపాధ్యాయులకి సూచించారు.ఈ కార్యక్రమం లో యం ఈ ఓ శాంతయ్య, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు దుర్గాప్రసాద్, నర్సయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.