కరీంనగర్
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడిరచిన జెయింట్ కిల్లర్, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిశారు. తనను కలిసేందుకు కామారెడ్డి నుండి కరీంనగర్ అనుచరులతో కలిసి వచ్చిన వెంకటరమణారెడ్డిని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు అరగంటకుపైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో తన గెలుపుకు దోహదపడిన అంశాలతోపాటు కార్యకర్తల క్రుషి, పార్టీ సహకారం వంటి అంశాలపై చర్చించారు.
Leave a comment