ఏలూరు
జిల్లాలో పోలవరం కుడికాలువ గట్టు ఖనిజ సంపదను మట్టి మాఫియా పట్ట పగలు కొల్లగొడుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడం తో అధికారుల పర్యవేక్షణ ఉండదని తెలిసి ఎటువంటి అనుమతులు లేకుండా వేల క్యూబిక్ విూటర్ల మేర పోలవరం కాలువ మట్టిని యంత్రాలతో యథేచ్ఛగా తవ్వి తరలించుకుపోతున్నారు.మరికొన్ని ప్రాంతాలలో అధికారులు కాంట్రాక్టర్ లనుండి అందినకాడికి దండుకుని అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా కాంట్రాక్టర్ లు 30 వేలు క్యూబిక్ విూటర్ ల మట్టి తవ్వుకోవడానికి అనుమతి కోరితే అనధికారికం గా మరో 30 వేల క్యూబిక్ విూటర్ లు మట్టి తవ్వుకున్నాఅధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.
Leave a comment