Bharatha Sakthi

గోపాల్ వాడ హత్య కేసులో నిందితుల అరెస్ట్

Bharath Sakthi 18/08/2023
Updated 2023/08/18 at 1:29 PM

భారత శక్తి ప్రతినిధి మంచిర్యాల, ఆగస్టు 17:

ఈనెల 10వ తారీఖు రోజున సాయంత్రం గోపాల్వాడ రైల్వే కేబిన్ శరణ్య హత్య పై తన అక్క జోడు స్రవంతి పిర్యాదు పై కేసునమోదు చేసి రామగుండము పోలీస్ కమీషనర్ గారి ఆదేశాల మేరకు మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షణలో, ఎసిపి తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో 4 టీం లుగా ఏర్పడి, నిందితులను గుర్తించి పరారిలో ఉన్న నిందితులను ఈ రోజు పట్టుకోవడం జరిగింది.

వివరాల్లోకి వెళితే……..
నిందితుడు సయ్యద్ జియా ఉల్ హక్ @సద్దు S/o late గఫూర్ ఉల్ హక్,వయస్సు:35 సం,,లు, కులం: ముస్లిం ,వృత్తి :CISF కానిస్టేబుల్, నివాసం: రాళ్ళపేట్ మంచెర్యాల, గతంలో గోపాల్ వాడలో నివాసం వుండేవాడు. అప్పుడు తన ఇంటి ముందరే బత్తిని శరణ్య ను ప్రేమించి తేదీ 19.02. 2013 రోజున హైదరాబాదులోని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు .వారికి ఒక పాప మనశ్విని వయస్సు 9 సం;లు పుట్టింది.. తర్వాత వారి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. నేరస్థుడు మరొక అమ్మాయి తో పరిచయం పెంచుకోయివటం తో ఇద్దరిమధ్యలో గొడవలు ఎక్కువ కావటంతో మృతురాలు శరణ్య మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ లో సయ్యద్ జియా ఉల్ హక్ పైన 498 (A)కేసు మరియు ఖర్చుల గురించి కోర్ట్ లో DVC కేసు పెట్టింది. దానితో నేరస్థుడు భార్యపై పగ పెంచుకొని తనకి విడాకులు ఇవ్వమని లేదంటే చంపుతానని శరణ్య ని చాలాసార్లు బెదిరించాడు. కానీ శరణ్య విడాకులు ఇవ్వడానికి ఒప్పుకునేది కాదు జూన్ 12వ తారీఖున బక్రీద్ పండుగ సందర్భంగా మంచిర్యాల సెలవులో ఇంటికి వచ్చినపుడు తన స్నేహితుడు సాయికుమార్ తో తన భార్య శరణ్య ను చంపివేయాలని డబ్బులు ఇస్తే చంపే వ్యక్తులు ఎవరైనా ఉంటే చెప్పమని తనకు కూడా ఎంతో కొంత ఇస్తానని చెప్పగా సాయికుమార్ ఒప్పుకున్నాడు.

బార్ లోనే హత్యకు ప్లాన్ ……..తర్వాతరెక్కి…. ఆ పై హత్య

జియా ఉల్ హక్ లీవ్ లో ఉండగానే సాయికుమార్ జియా ఉల్ హక్ అండాలమ్మ కాలనీలో ఉండే దారంగుల రాజు మరియు అతని సొంత తమ్ముడు దారంగుల శివ మర్డర్ చేయడానికి ఒప్పుకున్నారని తెలుపగా వారు గుర్తుపట్టడానికి శరణ్య ఫోటోను సాయికి ఫోన్ లో పంపించినాడు.
జూన్ నెల చివరలో నేరస్తులు జియా ఉల్ హక్ , సాయికుమార్, రాజు మరియు శివ లు మంచిర్యాలలోని తిరుమల బార్ లో కలిసి మర్డర్ చేయడానికి సుఫారి గురించి మాట్లాడగా రాజు మరియు శివలు 10 లక్షలు డిమాండ్ చేయగా దానికి తొమ్మిది లక్షలు ఇస్తానని జియా ఉల్ హక్ చెప్పగా ఒప్పందం కుదిరి రాజు మరియు శివలకు అడ్వాన్స్ గా 1,50,000/- రూపాయలు మరియు సుఫరీ సెట్ చేసినందుకు సాయి కుమార్ కు 50,000/- రూపాయలు ఇవ్వగా వారు తొందరలోనే పని పూర్తి చేస్తామని మిగతా డబ్బులు రెడీ చేసుకోమని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయినారు.. తర్వాత జూలై 11 వ తారీఖున సాయికుమార్ కి కత్తులు కొనడానికి ఐదువేల రూపాయలు చెప్పగా కి జియాఉల్ హక్ రూ.10,000/-రూపాయలు ఫోన్ పే చేసి 5000/- సాయికుమార్ ని వాడుకోమని, మిగతా 5000/- రాజుకు ఇచ్చినాడు.
ఆ తర్వాత రాజు శివ , మరికొందరు చంద్రగిరి సాయికుమార్, మంచర్ల రవితేజ , పల్లికొండ అనిల్,పల్లికొండ శివ, వేముల సాయి ,MD అమెర్ లతో పరిచయం ఏర్పరుచుకొని రాజు వారితో శరణ్య అను ఆమెను చంపితే తన భర్త మాకు 9 లక్షల సుఫారి ఇస్తాననగా ఒప్పందం కుదిరిందని. అట్టి మర్డర్ కు సహకరిస్తే అతడిచ్చిన డబ్బుల నుండి అందరికీ చెరో 30,000/- రూపాయలను ఇస్తామని చెప్పగా వారందరూ ఒప్పుకున్నారు అందరూ కలిసి శరణ్య ఇంటి నుండి హాస్పిటల్ కి వెళ్లే సమయం, ఇంటికి తిరిగి వచ్చే సమయం ఆమె వెళ్లే దారి ఇంటి పరిసర ప్రాంతాలు పలుమార్లు వేరువేరుగా రక్కి చేసి సమాచారాన్ని సేకరించగ రవితేజ ఆమె రైల్వే క్యాబిన్ గుండా వెళ్లే దారిలో ఉన్న రైల్వే ట్రాక్ మర్డర్ చేయడానికి అనుకూలమైన ప్రదేశం అని, అక్కడైతనే ఎవరు ఉండరని, మర్డర్ ఎలా చేయాలో మాకు ప్లాన్ గురించి వివరించగా అక్కడే హత్య చేయటానికి సరయిన చోటు గా నిర్దారించుకున్నారు. వారి ప్లాన్ లో భాగం గా 2-3 సార్లు ఆమెని మర్డర్ చేయడానికి ప్రయత్నించి ఆ సమయం లో అటు వైపుగా మనుషులు రావడంతో విఫలమైనారు.
ఈనెల 10 వ తేదీన అయిదుగు ఎవరి కత్తులను వారు తీసుకొని గోపాల్ వాడ రైల్వే క్యాబిన్ దగ్గరికి ఉదయం 7 గం,, వచ్చి శరణ్య రాక కోసం ఎదురు చూస్తుండగా రాజు మరియు అతని తమ్ముడు శివ రైల్వే ట్రాక్ పక్కన గల చెట్ల పొదల్లోకి కత్తులను లోపల పెట్టుకొని వెళ్ళిన. కొద్దిసేపటి శరణ్య తన పాపతో నడుచుకుంటూ వచ్చి ఆటొ లో వెళ్ళింది. ఉదయం వారి ప్రయత్నం విఫలం కావటం తో. తర్వాత సాయంత్రం శరణ్య ఇంటికి వెళ్ళేటపుడు ప్లాన్ మిస్ కావద్దని పథకం పక్కాగా వేసుకొని సాయంత్రం వరకు వేచి చూసి.సాయంత్రం సుమారు 6 గం; లు అయిదుగురు అక్కడికి వచ్చి వుండి. సాయంత్రం సుమారు 06.30 ని,, ల ప్రాంతం లో శరణ్య రైల్వే ట్రాక్ దాటగానే రాజు మరియు శివ ఇద్దరు ఒక్కసారిగా చెట్ల పొదల నుండి బయటకు వచ్చి రాజు 3-5 సార్లు మెడపై, చేతులపై కత్తి తో బలంగా నరికినాను. శివ అక్కడ గల రెండు పెద్ద బండ రాళ్ళతో ఆమె తలపై బాదగ ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో చనిపోగా అయిదుగురు అక్కడి నుండి రైల్వే ట్రాక్ గుండా వెళ్ళి అందరూ అక్కడి నుండి చెరో వైపు పారిపోయినారు రాజు శివ ఇద్దరు బండి మీద నేరుగా హైవే ఎక్కి పెద్దపల్లి కి వెళ్ళి అక్కడ బస్ స్టాండ్ ఏరియా లో బండి ని పార్క్ చేసి బస్ ఎక్కి హైదరాబాద్ అక్కడి నుండి వైజాగ్ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చి తప్పించుకు తిరిగినారు.

ఈ రోజు జియా ఉల్ హక్ మంచిర్యాల పోలీసు స్టేషన్ కి వచ్చి లొంగిపోయి ప్లాన్ పూర్తి అయినందుకు మర్డర్ కి సహకరించిన అందరూ వారికి రావాల్సిన లావాదేవీ ల గురించి మాట్లాడటానికి రాజు ,శివ రాజీవ్ నగర్ హైవే దగ్గరకు వచ్చి వారి ఫ్రెండ్స్ కి ఫోన్ చేయగా సాయికుమార్, వేముల సాయి, పల్లికొండ అనిల్,పల్లికొండ శివ , MD అమెర్, మంచర్ల రవితేజ లు అందరూ కలుసుకుందామని అనుకున్నామని నన్ను కూడా సాయికుమార్ రమ్మన్నాడని జియా ఉల్ హక్ చెప్పగా అతన్ని తీసుకొని వారు చెప్పిన ప్రదేశానికి వెళ్ళగా మా పోలీసు వారిని చూసి రవితేజ అక్కడి నుండి నుండి పారిపోగా మిగిలిన ఎనిమిది మంది ని పట్టుకున్నాము.

నిందితుల వివరాలు :

A1) సయ్యద్ జియా ఉల్ హక్ సద్ద సన్నాఫ్ కీర్తిశేషులు ఉల్ హక్,:35 సం,,లు,: ముస్లిం ,: సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్: రాళ్ళపేట్ మంచిర్యాల

A2) చంద్రగిరి సాయికుమార్ S/o శంకర్, వయస్సు: 25 సం,,లు, కులం: చాకలి వృత్తి బైక్ మెకానిక్ నివాసం: రాళ్ల పేట్ మంచిర్యాల

A3)దారంగుల రాజ్ కుమార్ @ రాజు S/o late నర్సయ్య,:26 సం,,లు,: వడ్డెర,:ట్రాక్టర్ డ్రైవరు నివాసం: అండాలమ్మ కాలనీ మంచిర్యాల

A4) దారంగుల శివ S/o late నర్సయ్య,:22 సం,,లు, కులం: వడ్డెర, వృత్తి:ట్రాక్టర్ డ్రైవరు నివాసం: అండాలమ్మ కాలనీ మంచిర్యాల.

A5) పల్లికొండ అనిల్ S/o నాగేష్ @ నాగయ్య వయస్సు: 19 సం,,లు వృతి వర్కర్ ఫర్నీచర్ కులం: బెస్త, నివాసం: కుందారం గ్రామం, జైపూర్ మండలం.ప్రస్తుతం మార్కండేయ కాలనీ గోదావరిఖని .

A6) వేముల సాయి S/o నాగేష్,: 21 సం,,లు,: వడ్డెర, మేషన్ వర్క్ వివాసం: గాంధీనగర్ ప్రస్తుతం :A క్యాబిన్, గోపాల్ వాడ, మంచిర్యాల

A7) మంచర్ల రవితేజ S/o చిన్నయ్య వయస్సు: 25 సం,,లు కులం: బెస్త, నివాసం: గొల్లవాడ మంచిర్యాల . పరారీలో వున్నాడు

A8) MD అమెర్ గౌరీ @ బబ్లూ S/o అజీమ్ గౌరీ,:21 సం,,లు, కులం: ముస్లిం, వృత్తి JCB డ్రైవరు నివాసం అండాలమ్మ కాలనీ మంచిర్యాల

A9) పల్లికొండ శివ కృష్ణ S/o రాములు ,వయస్సు:20 సం,,లు, కులం: పైంటర్, నివాసం గంగిపల్లి గ్రామం కుందారం జైపూర్, మంచిర్యాల
మృతురాలి ల వివరాలు :
బత్తిని శరణ్యా తండ్రి: మధునయ్య ,వయస్సు: 31సంత్సరాలు, కులం:తెనుగు , వృత్తి: ప్రైవేట్ జాబ్ మేడిలైఫ్ హాస్పిటల్ రిసెప్షన్ నివాసం: గోపాలవాడ , మంచిర్యాల,

సీజ్ చేసిన ప్రాపర్టీ వివరములు:
హత్యకు సంభందించి నేరస్తులు హత్య కి వాడిన (5) సెల్ పోన్ లను వారి వద్ద నుండి స్వాదీన పరచుకోవడం జరిగినది.చంద్రగిరి సాయికుమార్ వద్దనుండి రూ;4000/- స్వాదీన పరచుకోవడం జరిగినది. చాకచక్యంగా సాంకేతిక పరిజ్ఞానం తో నిడితులను పట్టుకొని హత్య కేసు మిస్టరీ ని ఛేదించిన M. రాజు ,ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్,మంచిర్యాల N. దేవయ్య CCS ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్ మంచిర్యాల ,A. రాజేందర్ సబ్ -ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్ మంచిర్యాల , K. జగదీష్ సబ్ -ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్ మంచిర్యాల, రాకేశ్ CCS ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలిస్ మంచిర్యాల , బి,దివాకర్ HC -249,తిరుపతి రెడ్డి HC 569,రాము PC 2964,సతీశ్ PC 2932,,శేకర్ PC 3257,మహేశ్ PC 2448 , PS మంచిర్యాల లను డి‌సి‌పి గారు అభినందించి రివార్డ్ ను అందజేయటం జరిగింది

Share this Article