Bharatha Sakthi

ప్రత్యేక పుస్తకాలతో కొలువుదీరిన పబ్లికేషన్స్ డివిజన్స్టాల్ విజయవాడ పుస్తక మహోత్సవంలో ప్రారంభించిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజేంద్ర చౌదరి.

Bharath Sakthi 08/01/2025
Updated 2025/01/08 at 6:25 PM

విజయవాడ, (భారతశక్తి) :
35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో 132, 133 లో ఏర్పాటు చేసిన పబ్లికేషన్స్ డివిజన్ స్టాల్ ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజేంద్ర చౌధురి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పుస్తకాలతో ఏర్పాటు చేసిన విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ పబ్లికేషన్ డివిజన్ ఎంతో కాలంగా ఎన్నో అరుదైన పుస్తకాలని ప్రజలకు అందిస్తుందని, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగార్ధులకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుల జీవితాలు, రాష్ట్రపతి భవన్ కు సంబంధించిన పుస్తకాలు, అదేవిధంగా రాష్ట్రపతి, ప్రధాన మంత్రుల ప్రసంగాలతో రూపుదిద్దుకున్న పుస్తకాలను ఇక్కడ ఏర్పాటు చేశామని, వీటి ద్వారా ముఖ్యంగా యువత ప్రయోజనం పొందాలని సూచించారు, ఈ కార్యక్రమంలో దూరదర్శన్, విజయవాడ ఉపసంచాలకులు శ్రీ కొండలరావు, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ సహాయ సంచాలకులు శ్రీ సాయి వెంపాటి, పబ్లికేషన్స్ డివిజన్, హైదరాబాద్ సహాయ సంచాలకులు శ్రీ సిరాజుద్దీన్ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Share this Article