కేరళలోని మలప్పురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ఓ వలస కార్మికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు మధ్యప్రదేశ్ నుంచి కేరళకు వలస వచ్చాడు. నిందితుడిని 36 ఏళ్ల రామ్ మహేష్ కుశ్వాగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడు రామ్ మహేష్ కుష్వా(36) చెలారి వద్ద వలస కూలీగా పని చేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న మరో వలస కూలీ కుమార్తె అయినా నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఉండే క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన నిందితుడు మహేష్.. శీతల పానీయంతో ప్రలోభపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమెదు చేసి అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని ఆమె తల్లికి అప్పగించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. చిన్నారి ఆమె తల్లి 6 నెలల క్రితమే కేరళకు వచ్చారు. కాగా నిందితుడికి మధ్యప్రదేశ్‌లోనూ ఏమైనా నేర నేపథ్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.