బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన ‘యానిమల్’ (Animal) శుక్రవారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ (Sandeep reddy vanga) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ఈ చిత్రం ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ టాక్‌తో నడుస్తోంది. సినిమా విడుదలైన రెండో రోజునే ఈ చిత్రం ఓటీటీ పార్టనర్‌ని ఫిక్స్ చేసుకుందని టాక్ వినిపిస్తోంది. ఇదే వార్త సినిమా విడుదలకు ముందు కూడా హల్‌చల్ చేసింది. అయితే సక్సెస్ బాటలో ఉండడంతో మరోసారి ఈ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. బిగ్ స్క్రీన్ పై 6-8 వారాల ఆడిన తర్వాత ఓటీటీలో (Ott Date Fix) స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. దీన్ని బట్టి చూస్తే సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డేన ‘యానిమల్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
పైరసీ షాక్ (Piracy shock)
తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్నా ఈ చిత్రానికి పైరసీ షాక్ తగిలింది. యానిమల్’ విడుదలై 24 గంటలు కాకముందే ఇంటర్‌నెట్‌లో దర్శనమిచ్చింది. తమిళ్ రాకర్స్, టెలిగ్రామ్, మూవీ రూల్స్.. వంటి పైరసీ వెబ్ సెట్స్ ఈ సినిమాని ఉచితంగా, హెచ్‌డీ క్వాలిటీ తో డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించాయి. విడుదలై రోజు గడవక ముందే ఇలా హెచ్ డీ ప్రింట్ లీక్ అవ్వటం వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి దీనిపై మేకర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.