న్యూఢల్లీి, అక్టోబరు 4
దేశంలో ఎక్కువగా బెంగాల్ లో యాచకులు ఉన్నారు. భిక్షాటన చేసుకుంటూ రెండు పూటల కడుపు నింపుకుంటున్నారు. అయితే ఇండియా చూసుకుంటే యాచకుల సంఖ్య ఎక్కవగానే ఉంది. వివిధ నగరాల్లో రోడ్లపై, సిగ్నల్స్ దగ్గర, మాల్స్ వెలువల, ఆలయం దగ్గర బిచ్చగాళ్లు కనిపిస్తూ ఉంటారు.భారతదేశంలో సుమారు 4 లక్షల మంది భిక్షాటన చేసుకుంటూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. వాస్తవానికి ఇవి ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు. కానీ దీనికి మించిన సంఖ్యలో కూడా బిచ్చగాళ్లు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.అలాగే ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే అత్యధికంగా యాచకులు కలిగిన రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఆ రాష్ట్రంలో బిచ్చగాళ్ల సంఖ్య దాదాపు 81 వేలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే దేశంలో మొత్తం 4 లక్షల 13 వేల మంది భిక్షాటన చేసేవాళ్లు ఉన్నారు. అయితే వీరిలో రెండు లక్షల మందికి పైగా పురుషులు.. అలాగే దాదాపు రెండు లక్షల మంది మహిళలు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాగే దీంతోపాటు చిన్నారులు సైతం యాచక వృత్తిలోనే ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ తర్వాత చూసూకుంటే ఉత్తరప్రదేశ్‌లో 65 వేలకు పైగా భిక్షాటన చేసుకునే వాళ్లు ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు ఉన్నాయి. అయితే చండీగఢ్‌లో కేవలం 121 మంది భిక్షగాళ్లు మాత్రమే ఉన్నారు.ఇక మరోవైపు చూసుకుంటే.. దేశంలో అతితక్కవగా బిచ్చగాళ్లు ఉన్న ప్రాంతం లక్షద్వీప్. లక్షద్వీప్‌లో కేవలం ఇద్దరు మాత్రమే యాచకులు ఉన్నారు. అలాగే ఇది కాకుండా దాద్ర నగర్ హవేలీలో 19 మంది, డామన్`డయ్యూలో 22 మంది వరకు భిక్షాటన చేసుకునే వాళ్లు ఉన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ సంఖ్య అనేది కచ్చితమైనది కాదు. ఎందుకంటే ప్రభుత్వం 2011లో నిర్వహించినటువంటి జనాభా లెక్కల ఆధారంగానే ఈ గణాంకాలను ఉన్నాయి.
Leave a comment