ఖమ్మం ప్రతినిది (భారత శక్తి )
స్థానిక మండల కేంద్రంలో జగ్గయ్యపేట రోడ్డు వృద్ధాశ్రమం సమీపంలో భాగ్యలక్ష్మి ఈ – బైక్స్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ యువ నాయకులు బీపీ నాయక్. ముందుగా షోరూం యజమాని తోటపల్లి రమేష్ బాబు వారి కుటుంబ సభ్యులు పూజా, ప్రార్థన కార్యక్రమంతో మొదలుపెట్టి కుటుంబ సభ్యులచే షోరూం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మై డ్రీమ్ బైక్స్ సంస్థ వ్యవస్థాపకులు మురళి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కోల రాజేశ్వరి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీపీ నాయక్, మురళీ లు మాట్లాడుతూ బోనకల్ మండల ప్రజల సౌకర్యం కోసం ఎలక్ట్రికల్ బైక్స్ అందుబాటులోకి రావడం శుభ పరిణామం అని తెలియజేశారు. రోజువారీ ఉపయోగం కోసం బైక్‌ను కొనుగోలు చేయాలని, పెట్రోల్ ఖర్చు లేకుండా ఉండాలనుకునే వారికి మంచి ఎలక్ట్రిక్ బైక్ ఉంది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 175 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్తుంది, భవిష్యత్తు అంతా చార్జింగ్ తో నడిచే విద్యుత్ వాహనాలదే అని అభిప్రాయపడ్డారు.
ఈ షోరూం విజయవంతం అవ్వాలని యజమానులకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతోటి వెంకటేశ్వర్లు, పాస్టర్ రాజారత్నం,అవేటి చక్రి, భూక్య శ్రీను, బానోతు రాజు నాయక్, రేఖ, తాతారావు, గ్రామ పెద్దలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.