ములుగు జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 28 (భారత శక్తి) : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) భారత శక్తి తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ములుగు జిల్లా కేంద్రంలో బండారుపల్లి రోడ్డు లోని గిరిజన భవనంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ఎస్పి శబరీష్ లతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కమేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2024 విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా జిల్లాలోని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులకు కృతజ్ఞత సమావేశం నిర్వహించి, మీడియా ప్రతినిధులకు సన్మానం తో పాటు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం భారత శక్తి తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిలా పత్రికలు ఉండాలని, ప్రశ్నించే గొంతుకలుగా ఉండి ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని మంత్రి సీతక్క అన్నారు. భారత శక్తి దినపత్రిక యాజమాన్యానికి ములుగు జిల్లా ప్రతినిధి ఎనగందుల కొమురయ్య వారి బృందానికి సీతక్క శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, జిల్లా ఎస్పీ శబరిష్, ఏటూర్ నాగారం ఏఎస్పీ సంకీర్త్ ,ములుగు డి.ఎస్పీ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, ఐఅండ్ పీఆర్ జెడి లక్ష్మణ్ ములుగు డిపిఆర్ఓ రఫిక్ ఎస్సీ, మీడియా మిత్రులు ఎండి షఫీ, బేతి సతీష్ ఎ.శంకర్ చుంచు రమేష్, సి.హెచ్ రాజ వర్ధన్, ఆవుల వెంకన్న, కవ్వంపల్లి అనిల్ కుమార్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.