Bharatha Sakthi

ఏపీకి సీఈసీ

admin 07/12/2023
Updated 2023/12/07 at 6:36 AM

విజయవాడ, డిసెంబర్‌ 7
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆంధ్రప్రదేశ్‌ కు రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 22, 23 తేదీల్లో పర్యటించనున్నారు. ఓటర్ల జాబితా అక్రమాలపై ప్రతిపక్ష నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఈ బృందం ప్రత్యేకంగా పరిశిలించనున్నట్లు తెలిసింది. దొంగ ఓట్ల పేరుతో అసలు ఓట్లను తొలగించారంటూ విపక్ష టీడీపీ పెద్దయెత్తున ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేయడమే కాకుండా నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దీనిపై జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ అధికారులు తమ పర్యటనలో భాగంగా రాజకీయ పక్షాలను కలవడంతో పాటు ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఏపీలో ఓట్ల అక్రమాలపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ చెందిన బృందం రాష్ట్రనికి చ్చే ముందే ఢల్లీి వెళ్లి సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పరిశీలకులు ఆయా నియోజకవర్గాల్లో సవిూక్షా సమావేశాలు నిర్వహించారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం సచివాలయంలో కూర్చోని ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకల అంశం రాజకీయం దుమారం రేపుతోంది. అధికార వైసీపీ నేతలే ఓటర్ల జాబితాలో టీడీపీ, జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని తెలుగు దేశం పార్టీ, జనసేన ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇరు పార్టీలు అటు ఎన్నికల కమిషన్‌తో పాటు, ఇటు జిల్లాల వారీగా కలెక్టర్లను కలిసి పిర్యాదులు చేస్తున్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారని టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలపై కూడా కలిసి పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అవతవకలను కేంద్రీకరించి వాటిని ప్రజల్లోకి వెళ్లి వివరించాలని భావిస్తున్నాయి. అందులో భాగంగా రెండు పార్టీలు నేతలు రాష్ట్రంలోని అన్ని నియజకవర్గాల్లోనూ ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలో పేర్లను పరిశీలిస్తున్నారు. కొత్త ఓటర్ల చేరిక, పోలింగ్‌ బూత్‌ల మార్పు, ఓటర్ల డబల్‌ ఎంట్రీపై ప్రతి ఇంటికి వెళ్ళి పరిశీలించనున్నారు.అక్రమాలకు పాల్పడిన పలువు? అధికారులను ఇప్పటికే విధుల నుంచి తప్పించారు. ఇంకా అనేక మంది ఉద్యోగులు… అక్రమాల్లో బాధ్యులుగా ఉన్నారని.. వారు చేసిన అక్రమాలపై విచారణ చేయాలన్న డిమాండ్‌ టీడీపీ వినిపిస్తోంది. ఎన్నికల సంఘం అధికారులకూ అదే చెప్పనున్నారు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *