తెలంగాణలో బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రకరకాల అంశాలపై ఆందోళనలు చేపడుతూ జనాల్లోకి వెళ్తున్న హస్తం పార్టీ మరో వైపు వలసలు ప్రోత్సహిస్తోంది.వరుస చేరికలు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న కాంగ్రెస్‌కు తాజాగా కార్పొరేటర్లు, జడ్పీటీసీలు కూడా దొరుకుతున్నారు. ఇది పార్టీ వర్గాల్లో ఉత్సాహం నింపుతోంది. తాజా పరిణమాలు పార్టీకి మేలు చేస్తాయని భావిస్తున్న కాంగ్రెస్ మరికొందరు చేరతారని ఆశిస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, అశ్వారావుపేటకు చెందిన గిరిజన నేత తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ుఖఅఅ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పినపాక నియోజకవర్గం కరకగూడెం జడ్పీటీసీ కాంతారావు కూడా హస్తం పార్టీలో చేరారు. వారి వెంట వారి అనుచరులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.రాష్ట్రంలో ప్రజలకు ప్రత్యామ్నాయ శక్తి కాంగ్రెస్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఇస్తామని ప్రకటించారు. మరో వైపు గ్రేటర్ ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ విజయారెడ్డి గురువారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ నాయకత్వంపై ఆమె కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.గత నెలలో టీఆర్‌ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఓదేలు, ఆయన భార్య ఢల్లీి వెళ్లేంత వరకు విషయాన్ని టీపీసీసీ నాయకత్వం రహస్యంగా ఉంచింది.మరో వైపు పార్టీలో చేరుతున్న వీళ్లకు టికెట్‌పై స్పష్టమైన హావిూ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల సీనియర్ నేతలు తమ పరిస్థితేంటని దిగులు చెందుతున్నారు