తెలంగాణ బీజేపీలో అసంతృప్తులను బుజ్జగించేందుకు అధిష్టానం ఫుల్ పోకస్ పెట్టింది. దీనిలో భాగంగా ఇవాళ ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ కానుంది. వారితోపాటు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ మీటింగ్ కు హాజరుకానున్నారు.ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను.. పార్టీ మార్పుపై రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు..తెలంగాణ బీజేపీలో అసంతృప్తులను బుజ్జగించేందుకు అధిష్టానం ఫుల్ పోకస్ పెట్టింది. దీనిలో భాగంగా ఇవాళ ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ కానుంది. వారితోపాటు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ మీటింగ్ కు హాజరుకానున్నారు. ఓ వైపు అసమ్మతి నేతలు.. మరోవైపు పార్టీ మారుతున్నారన్న ప్రచారం.. పార్టీలో అంతర్గత వ్యవహారాలు, కొత్త బాధ్యతలు ఇలా అన్నింటిని కూడా చక్కదిద్దేందుకు సిద్ధమవుతోంది. అయితే, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు.ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను.. ఊహాగానాలు నమ్మవద్దంటూ రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేడు జరిగే సమావేశంలో తన అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్ వివరిస్తామని వివరించారు. కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారంటూ అభిప్రాయపడ్డారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం ఇస్తుంది.. అందులో భాగంగానే కేటీఆర్ కు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్ తీసుకున్నారంటూ వివరించారు. కేటీఆర్ కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని తెలిపారు.
తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియా ఎక్కువ చేసి చూపిస్తుందని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ, అమిషా తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రజల ఆలోచనలో.. కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఇరువురు నేతలు..
ఢిల్లీ వెళ్తున్న ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. బిజెపి అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ బయలుదేరిన వారు.. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు