అభయహస్తం 6 దరఖాస్తుల డేటా ఎంట్రీ 12వ తేదీ కల్లా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు దరఖాస్తుదారుల పూర్తి సమాచారాన్ని పక్కాగా డేటాను నమోదు చేయాలన్నారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా ఆపరేటర్లు ఒకటికి రెండుసార్లు పరిశీలించి నమోదు చేయాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు అందరూ ఈరోజు సాయంత్రం నుండి డేటా ఎంట్రీ ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను జనవరి 12వ తేదీ నాటికి ప్రజాపాలన వెబ్సైట్లో అన్ని వివరాలు నమోదు చేసే విధంగా అధికారులు ఆపరేటర్లు కృషి చేయాలి అన్నారు. తహశీల్దార్ లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు,దరఖాస్తులను జాగ్రత్తగా భద్రపరిచిన వాటిని డేటా ఎంట్రీ అయిన తరువాత దరఖాస్తులు వేరొక రూములో జాగ్రత్తపరచాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం డేటా ఎంట్రీ కొరకు 489 మంది బృందాలు డేటా ఎంట్రీ కొరకు అని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్లైన్లో ఒక్క దరఖాస్తు అప్లోడ్ చేసినందుకు ఐదు రూపాయలు చొప్పున చెల్లించడం జరుగుతుందని, పనిచేసే వారందరికీ అక్కడే భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తు నమోదు చేసిన తర్వాత వచ్చే యూనిట్ నెంబర్ను రెడ్ పెన్నుతో దరఖాస్తుపై బాగాన వ్రాయాలన్నారు. దరఖాస్తు కుడి పక్కన డేటా ఎంట్రీ ఆపరేటర్ సంతకం చేయాలని కలెక్టర్ తెలిపారు. డేటా ఎంట్రీ పక్కగా జరగాలన్నారు, ఈ డేటా ఆధారంగానే లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుంది అన్నారు. డేటా ఎంట్రీ లో ఎలాంటి తప్పులు జరిగినా లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని, జాగ్రత్తగా డేటా ఎంట్రీ చేయాలన్నారు. అనంతరం డేటా ఎంట్రీ ఆపరేటర్ల సందేహాలను జిల్లా కలెక్టర్ నివృత్తి చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక, వెంకట్ రెడ్డి, ఈడియం గఫార్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సిబ్బంది పాల్గొన్నారు.