వరంగల్, జూలై 6
తండ్రికి నచ్చని విధంగా ప్రేమ పెళ్లి చేసుకుంటే కొంత మంది ఎంత క్రూరంగా ప్రవర్తించారో గతంలో ఎన్నో ఘటనలు చూశాం. కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని అక్కసుతో అల్లుడ్ని చంపించడం లేదా కుమార్తెనే అంతం చేసిన తరహా పరువు హత్యలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కానీ, తాజాగా ఓ తండ్రి మరో విధంగా తన అక్కసు తీర్చుకున్నాడు. కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో ఏకంగా ఊళ్లో ఇళ్లను తగలబెట్టించాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. తన ముద్దుల కూతురు ప్రేమ వివాహం చేసుకోవటంతో ఆగ్రహానికి గురైన ఓ సర్పంచి బీభత్సం చేయించాడు. తన కుమార్తెను పెళ్లి చేసుకున్న యువకుడి ఇంటితో పాటు, పెళ్లికి సహకరించారనే నెపంతో అతడి స్నేహితుల ఇళ్లపైనా దాడి చేయించాడు. వారి ఇళ్లను దగ్ధం చేశాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ వ్యవహరించిన తీరుతో నర్సంపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.పోలీసులు వెల్లడిరచిన వివరాల ప్రకారం.. ఇటికాలపల్లి గ్రామ సర్పంచ్ మండల రవీందర్ కుమార్తె కావ్య శ్రీ. ఆమె అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతని పేరు జలగం రంజిత్. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. హాసన్ పర్తిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న కావ్యశ్రీ ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుంది. రెండు రోజుల క్రితం రంజిత్ తో వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలిసిన సర్పంచ్ మండల రవీందర్ ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కావ్యశ్రీ, రంజిత్ ఇద్దర్నీ పోలీస్ స్టేషన్ కు రప్పించి మాట్లాడారు. రంజిత్ ను వదిలేసి తమతో రావాలని కావ్యశ్రీని తండ్రి రవీందర్ కోరాడు. కుమార్తె వినకపోవడంతో ఆగ్రహానికి గురైన రవీందర్ తన అనుచరులతో కలిసి రంజిత్ ఇంటిపై దాడి చేశారు. ఇంటికి నిప్పు పెట్టించాడు. పెళ్లికి సహకరించారనే నెపంతో రంజిత్ స్నేహితుల ఇళ్లపై కూడా దాడి చేసి నిప్పు పెట్టారు. దీంతో ఇళ్లలో ఉన్నవారు భయంతో బయటికి వచ్చి సర్పంచ్ అనుచరులను ప్రశ్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వీడియోలో కావ్య శ్రీ మాట్లాడుతూ.. తనను బలవంతం విూద ఎవరూ పెళ్లికి ఒప్పించలేదని, తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని స్పష్టత ఇచ్చింది. తాను రంజిత్ తో సంతోషంగా ఉంటానని చెప్పింది. విూరేం బాధ పడొద్దు.. మా కోసం వెతకొద్దు అంటూ కోరింది. తమను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇద్దరం కలిసి చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పింది. ‘‘విూరు సంతోషంగా ఉండండి.. మమ్మల్ని సంతోషంగా ఉంచండి. సారీ మవ్మిూ, డాడీ’’ అంటూ వీడియోను కావ్యశ్రీ విడుదల చేసింది.ఇల్లు కాలిపోయిన బాధితులు మాట్లాడుతూ.. తమ ఇళ్లను సర్పంచ్ దౌర్జన్యంగా కాల్చి బూడిద చేశాడని ఆరోపించారు. ఆయన అనుచరులు దౌర్జన్యం ఇంట్లోకి వచ్చి విలువైన వస్తువులు, డబ్బు తీసుకెళ్లారని ఆరోపించారు.
Leave a comment