మావోయిస్టు పార్టీ 23వ పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా మంగళవారం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం(Dummugudem) మండల సరిహద్దున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. పొటకపల్లి-పాలోడి, పొటకపల్లి-దుబ్బమరక ప్రధాన రహదారులపై నాలుగు చోట్ల రోడ్డును తవ్వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా మంగళవారం దుమ్ముగూడెం మండల సరిహద్దు కిష్టారం వారాంతపు సంతకు వెళ్లే వ్యాపారులు ఎప్పటిలానే వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చారు. ముందు జాగ్రత్తల్లో భాగంగా రాత్రి 7.30కు భద్రాచలం-చర్ల సర్వీసును ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులను సైతం నిలిపివేశారు. వారోత్సవాలకు 8వ తేదీ చివరి రోజు కావడంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.