ఖమ్మం జూన్ 27. రజక సంఘం సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్, డీసీఎంఎస్ డైరెక్టర్ జక్కుల లక్ష్మయ్య పిలువు మేరకు రజక సంఘం నూతన కమిటీల, ఏర్పాట్లలో భాగంగా వన్ టౌన్ పరిధిలోని 14,15,18, 40,41, డివిజన్ లలో ఖమ్మం నగర నాయకులు విస్తృతంగా పర్యటించి రజక సంఘం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఖమ్మం నగరంలోని 60 డివిజన్ లలో నూతన కమిటీలను ఎన్నుకొని రజక సంఘం బలోపేతానికి కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న రజకులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అడాహాక్ కమిటీ సభ్యులు రేగళ్ల సీతారాములు, రేగళ్ల కొండలు, జక్కుల వెంకటరమణ, నగర కన్వీనర్ కణతాల నరసింహా రావు, కండ్రాతి వెంకటేశ్వర్లు, వన్ టౌన్ గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి శంకర్, అధ్యక్షులు గోలీ రామారావు, ప్రధాన కార్యదర్శి తెనాలి వీరబాబు, ఉపాధ్యక్షులు వట్టికోట దర్గయ్య, టూ టౌన్ అధ్యక్షలు కొలిపాక వెంకట్, గొట్టేపర్తి శ్రీనివాస్, మాచర్ల యాలాద్రి, వట్టికోట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.