కడప
కడపప జిల్లా ఎర్రగుంటలో ఆదివారం అర్ధరాత్రి వినాయకుడి నిమజ్జనం వద్ద జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పందించారు. నలుగురు పోలీసులను సస్పెండ్ చేసారు. ముగ్గురికి మెమో దాఖలు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఒక కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశారు. సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐలు ప్రవీణ్ కుమార్, కృష్ణంరాజులకు ఎస్పీ మెమో ఇచ్చినట్లు దాఖలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
Leave a comment