“వాళ్ల నన్ను బాగానే చూసుకుంటున్నారు. నాకు చికిత్స చేస్తున్నారు. మందులు ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది. నేను ఒక్కటే అడుగుతున్నాను. నన్ను వీలైనంత త్వరంగా ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లండి. మా అమ్మనాన్నల దగ్గరకు తీసుకెళ్లండి. దయచేసి వీలైనంత త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి.” అని మియా వేడుకుంది. మరోవైపు మియా గత వారం అపహరణకు గురైనట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధృవీకరించాయి. అధికారులు మియా కుటుంబానికి సమాచారం అందించి వారితో మాట్లాడారని, వారితో టచ్‌లో ఉన్నారని అధికారులు చెప్పారు. హమాస్ విడుదల చేసిన వీడియోలో వారు తమను తాము మానవీయత ఉన్న మనుషులుగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఐడీఎఫ్ ఎక్స్(ట్విట్టర్)లో ఓ ట్వీట్ చేసింది. అయినప్పటికీ వారు శిశువులు, పిల్లలు, పురుషులు, మహిళలు, వృద్ధుల హత్య, అపహరణకు బాధ్యత వహించే భయంకరమైన ఉగ్రవాద సంస్థ అని పేర్కొంది. కాగా మియాతో సహా బందీలుగా ఉన్న వారందరినీ తిరిగి తీసుకురావడానికి తాము అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని ఐడీఎఫ్ పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లోని ఒక నివేదిక ప్రకారం.. మియా కుటుంబం ఈ వీడియోపై స్పందించింది. ఆమె సురక్షితంగా ఉన్నందుకు ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా మియా ఇజ్రాయెల్-ఫ్రెంచ్ ద్వంద్వ పౌరురాలు. తమ బంధువులను విడిపించేందుకు సహాయం చేయాలని గత వారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు విజ్ఞప్తి చేసిన ఫ్రెంచ్ కుటుంబాలలో ఆమె కుటుంబం కూడా ఉందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది