నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని మౌలానా నగర్ లో జరిగిన సంఘటన. అటవీ సాగుదారులపై ఆగని ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం సాగు భూమిలో గుంతలు తవ్విన అధికారులు . భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని అటవీశాఖ అధికారుల ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ భూములను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది.కుబీర్ మండలంలోని బ్రహ్మేశ్వర గ్రామపంచాయతీ పరిధిలోని మౌలానా నగర్ లో ఇద్దరు ముస్లిం మైనార్టీలు పేరు షేక్ మునీర్, షేక్ అలీమ్ అనేటటువంటి వ్యక్తులు తలా మూడెకరాల అటవీ భూమిని సాగు చేసుకుని బతుకుతున్నారు. వీరు గత 30, 40 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు. 2008లో ఈ భూమి అటవీశాఖ అధికారులు సర్వే చేయడం జరిగింది .అటహక్కుల కమిటీ ఇచ్చినటువంటి రసీదులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. తిరిగి 2023లో ఈ భూమిని మళ్లీ అటవీశాఖ అధికారులు సర్వే చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము ఈ ప్రాంతంలో నివసిస్తున్న సాగుదారులు అటవీశాఖ అధికారులకు ముడుపులు అప్పజెప్తున్నారు .సాగుదారులు విధిలేక సంవత్సరానికి 5 నుండి 10,000 ఇక్కడ ఉన్నటువంటి అటవీశాఖ అధికారికి ఇస్తున్నారు. ఇది నిజం .ఇంతకాలం నుండి సాగులో ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది. ఇక్కడ ఎఫ్ఎస్ఓ కోటేశ్ వేధింపులను తట్టుకోలేక ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరు రైతులు పై అధికారులకు వీళ్ళ వసూళ్లపై ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపి అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకుంటే ఆటవిశాఖ వాళ్ళు తప్పు చేసినట్టు భావించల్సి వస్తుందని సాగులో ఉన్నటువంటి భూమిని అటవీశాఖ స్వాధీనం చేసుకుంటుందని ప్రకటన ఇచ్చారు. ఆ భూమిలో జెసిబి తో గుంతలు తవ్వారు .ఈ చర్యను ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించాలని ,సాగులో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టా ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అటవీశాఖ అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దాదాపు అటవీ భూములు ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఇదే తంతు కొనసాగుతుంది .కానీ అక్కడ ఉన్నటువంటి పేద రైతులు అటవీ శాఖ వారికి డబ్బులు ఇవ్వకపోతే కొత్త సమస్యలు వస్తాయి అని ఎంతో కొంత ఇస్తూ పోతున్నారు .ప్రతి సంవత్సరం ఎందుకు ఇవ్వాలి ,ప్రతిసారి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకే వీళ్ళ భూమిని అటవి శాఖ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే అటవీశాఖ ఈ భూమి నుండి వైదొలగాలి. ఆ రైతులని ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పోడు సాగుదారులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని అతి ఉత్సాహం ప్రదర్శించద్దని, ఈ జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క అటవీశాఖ అధికారులకు హెచ్చరించినప్పటికీ లంచాలకు ఆలవాటు పడినటువంటి కొంతమంది అటవీశాఖ అధికారులు ఆ వైఖరిని మానుకోకుండా రైతులను వేధిస్తున్నారు. వెంటనే దీనిపై న్యాయవిచారణ జరిపి అటవీశాఖ అధికారి కోటేష్ ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ భూములను సందర్శించిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన కుమార్, జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి,జిల్లా సహాయ కార్యదర్శి తిమ్మాపురం ముత్తన్న,అంబేద్కర్ పూలే మహాజన సంఘం జిల్లా అధ్యక్షులు మునేసుల శైలేందర్, సాగు రైతులు షేక్ మునీరుద్దీన్,షేక్ అలీముద్దీన్ లు పాల్గొన్నారు .