Bharatha Sakthi

7200 కోట్ల రూపాయల విలువ గల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం

Bharath Sakthi 09/12/2023
Updated 2023/12/09 at 8:55 AM

ఆదివాసీ గౌరవ్ దినోత్సవం, స్వాతంత్య్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఝార్ఖండ్ లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే రూ.7,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. వాటిలో విద్య, రోడ్డు, పెట్రోలియం, బొగ్గు, రైల్వే ప్రాజెక్టులున్నాయి.
శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో ఎన్‌హెచ్ 133లోని 52 కిలోమీటర్ల నిడివి గల మహాగమ-హంస్ దిహ రహదారి నాలుగు లేన్ల విస్తరణ; ఎన్‌హెచ్ 114ఎ లోని 45 కిలోమీటర్ల నిడివి గల బసుకినాథ్-దేవగఢ్ సెక్షన్ నాలుగు లేన్ల విస్తరణ; కెడిహెచ్-పూర్ణాదిహ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణం; ఐఐటి రాంచిలో కొత్త విద్య, పరిపాలనా భవనాల నిర్మాణం ప్రాజెక్టులున్నాయి.
కెడిహెచ్-పునాదిహ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణంతో బొగ్గు రవాణా, లోడింగ్ సామర్థ్యం పెరిగి నిరంతరాయంగా బొగ్గు సరఫరాకు వీలు కలుగుతుంది. ఎన్‌హెచ్-133లోని మహాగమ-హంస్ దిహ నాలుగు లేన్ల రహదారి, బసుకినాథ్-దేవ్ ధన్ సెక్షన్ నిర్మాణం ప్రాజెక్టులు ఖనిజాల సత్వర రవాణాకు మార్గం సుగమ్యమై గిరిజనులు అధికంగా నివశించే ప్రాంతాల సుసంపన్నతకు దారి తీస్తుంది. అలాగే వైద్యనాథ్ ధామ్, బసుకినాథ్ దేవాలయాలు తేలిగ్గా అందుబాటులోకి వస్తాయి.

పిఎం నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఐఐఎం రాంచి కొత్త క్యాంపస్, ఐఐటి ఐఎస్ఎం ధన్‌బాద్ లో కొత్త హాస్టల్; బొకారోలో పెట్రోలియం ఆయిల్ అండ్ లూబ్రికెంట్ డిపో (పిఓఎల్); హతియా-పక్రా సెక్షన్, తల్గారియా-బొకారో సెక్షన్ రైల్వే ప్రాజెక్టులు; జరంగ్ దిహ-పట్రాటు సెక్షన్ డబ్లింగ్ పనులున్నాయి. వీటికి తోడు ఝార్ఖండ్ లో 100% రైల్వే విద్యుదీకరణ కూడా పూర్తయింది.
ఝార్ఖండ్ లోని ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతుల మెరుగుదల, కొత్త క్యాంపస్‌‌ల నిర్మాణం విద్యాకార్యక్రయాలు నిరంతరాయంగా జరిగేందుకు సహాయపడుతుంది. అత్యాధునిక వాతావరణంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం విద్యార్థులకు కలుగుతుంది. ఇక్కడ అద్భుతమైన వాతావరణంలో విద్య నేర్చుకునే విద్యార్థులు భవిష్యత్తులో అభివృద్ధి చెందిన భారత్ కు విశేషమైన సేవలందించగలుగుతారు.

బొకారోలోని బిపిసిఎల్ పిఓఎల్ డిపోను జాతికి అంకితం చేశారు. అలాగే ఝార్ఖండ్ లో రైల్వే నెట్ వర్క్ నూరు శాతం విద్యుదీకరణ పూర్తి కావడం వల్ల కర్బన వ్యర్థాలు తగ్గి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది.
పట్రాటు-జరందిల్ సెక్షన్ డబ్లింగ్ తో పాటు హాతియా-పక్రా సెక్షన్, తల్గారియా-బొకారో సెక్షన్ పనులు కూడా చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే వందే భారత్ వంటి హై స్పీడ్ రైళ్లు ఈ మార్గాల్లో తిరిగే అవకాశం కలుగుతుంది. ఈ ప్రాజెక్టుల ప్రారంభ, శంకుస్థాపన వల్ల ఝార్ఖండ్ అభివృద్ధి ఉత్తేజితం కావడమే కాకుండా, నవభారత నిర్మాణం సంకల్పం సాకారం కావడానికి సహాయకారి అవుతుంది.

పిఎం గతిశక్తి పోర్టల్‌ను సమర్థవంతమైన సాధనంగా ఉపయోగించుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వం సమర్థవంతంగా అమలుపరుస్తుంది. గిరిజన సమాజాలకు సంబంధించిన వాస్తవ గణాంకాల సేకరణ, డేటా మ్యాపింగ్, పిఎం గతిశక్తి పోర్టల్ ద్వారా పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక మొబైల్ యాప్, పోర్టల్ కూడా అభివృద్ధి చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు కోట్లాది గిరిజన కుటుంబాల జీవితాలను మెరుగుపరిచాయి.

Share this Article