భోపాల్, జూలై 3
మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సామాజిక మాధ్యమాల యుగంలో బాలబాలికలకు 14 ఏళ్లకే యుక్త వయసు వస్తుందని అభిప్రాయపడిరది. ఈ నేపథ్యంలో బాలికలకు శృంగారానికి సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో బాలురను చట్టపరమైన చర్యల నుంచి కాపాడొచ్చని తెలిపింది. అయితే 2020లో ఓ బాలికను పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడంటూ ఓ యువకుడిపై గతంలో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ ధర్మాసనం జూన్ 27 న ఈ కేసును కొట్టివేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ బాలిక ఓ వ్యక్తి వద్ద ట్యూషన్ చెప్పించుకునేది. అతను ఓ రోజు మత్తు కలిపిన కూల్ డ్రిరక్ ఇచ్చి తనను అత్యాచారం చేసి వీడియో కూడా తీశాడని ఆ బాలిక తెలిపింది.అలాగే దాన్ని చూపించి బెదిరిస్తూ తనను లొంగదీసుకున్నాడని ఆరోపించింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ బాలికకు మరో సన్నిహిత బంధువుతో కూడా శారీరక సంబంధం ఉన్నట్లు హైకోర్టు తెలిపింది. ఇంటర్నెట్ వల్ల బాలబాలికలకు 14 ఏళ్లకే పెద్దరికం వస్తోందని.. హైకోర్టు న్యాయమూర్తి దీపక్ కుమార్ అగర్వాల్ తెలిపారు. తక్కువ వయసులోనే బాలబాలికలు శారీరక ఆకర్షణలకు గరువుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇద్దరి తప్పు ఉన్నప్పటికీ బాలురు మాత్రమే నేరాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలికలకు శృంగారానికి సమ్మతి తెలిపే వయసును తగ్గించడం వల్ల బాలురను కాపడవచ్చని స్పష్టం చేశారు.
Leave a comment