‘జనతా గ్యారేజ్’లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఎన్టీఆర్ – కొరటాల శివ మరోసారి జట్టు కట్టారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ కథానాయిక. ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో ఓ భారీ పోరాట దృశ్యాన్ని తెరకెక్కించారు. అండర్ వాటర్ సీక్వెన్సలో చేసిన ఫైట్ ఇది. సముద్ర తీరం నేపథ్యంలో సాగే కథ ఇది. సముద్రంలో హీరోకీ, విలన గ్యాంగ్‌కీ మధ్య జరగే భీకరమైన పోరాటాన్ని వందల మంది ఫైటర్లతో తెరకెక్కించారని సమాచారం. దాదాపు 15 రోజుల పాటు ఈ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించారు. ఈ ఫైట్ సీక్వెన్స ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందని తెలుస్తోంది. సైఫ్ అలీఖాన ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేస్తారు.