(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, డిసెంబర్ 15: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బుధవారం అర్ధరాత్రి 11 గంటల సమయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిరిసిల్ల రోడ్డులో గల అయ్యప్ప షాపింగ్ మాల్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత స్థానికులు ఆందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జెసిపి సహాయంతో
షాపింగ్ మాల్ షట్టర్లు తొలగించారు.
గురువారం ఉదయం 7 గంటల వరకు మంటలు అదుపులోకి తీసుకురాగా మిగతా రెండు అంతస్తులు మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు 5 ఫైర్ ఇంజన్లు హైదరాబాద్ సెక్రెటరీ నుండి బ్రోన్టో స్కై లిఫ్ట్ 54 ఫీట్ల హైడ్రాలిక్ మిషన్ తీసుకువచ్చారు. అయితే భారీగా అగ్నిమంటలు ఎగిసిపడుతుండడంతో అదుపు చేయడం కష్టంగా మారింది. దాంతో పక్కనే ఉన్న సెల్ ఫోన్ షాపులు ఖాళీ చేయించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 6 కోట్ల రూపాయలు విలువైన సామాగ్రి కాలి బూడిద అయ్యాయి. మాల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.