Bharatha Sakthi

ఓట్లు అడిగేందుకు వస్తే చెప్పుతో కొడతాం… : మంత్రి అంబటికి షాక్

Bharath Sakthi 06/01/2024
Updated 2024/01/06 at 6:21 AM

ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఓట్లు అడిగేందుకు వస్తే చెప్పుతో కొడతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ళలో మంత్రి అంబటి రాంబాబుకు ఈ షాక్ తగిలింది. బుధవారంనాడు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మన్సూర్ వలి మృతదేహాన్ని చూసేందుకు మంత్రి అంబటి రాంబాబు గురువారం గ్రామానికి వచ్చారు. అయితే చనిపోయిన సమయంలో రాకుండా…

ఇప్పుడెందుకు వచ్చావంటూ మంత్రిపై బాధితులు మండిపడ్డారు.
‘మేము వైసీసీ సానుభూతిపరులం. మాకే ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు?. మేం ఓట్లేస్తేనే గెలిచావు. ఈసారి ఓట్ల కోసం వస్తే చెప్పుతో కొడతాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోని ఈ సంఘటనతో అవాక్కయిన మంత్రి అంబటి.. ఏమీ మాట్లాడకుండా.. మన్సూర్ వలి మృతదేహానికి పూలమాల వేసి వెళ్లి పోయారు. కాగా గ్రామంలో కూరగాయల వ్యాపారం చేసుకునే షేక్ మన్సూరలి బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటనకు కారణమైన వాహన డ్రైవర్ను బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి, పంపేయడంతో ముస్లింలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

Share this Article