Bharatha Sakthi

సంక్రాంతి బరిలో.. 11 భాషల్లో..

admin 01/07/2023
Updated 2023/07/01 at 9:29 AM

తేజా సజ్జా (Teja sajja) కీలక పాత్రలో, అమృత అయ్యర్‌ (Amritha Aiyer) కథానాయికగా ప్రశాంత్‌ వర్మ (Prashanth varma)దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హనుమాన్‌’.(Hanu man) పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. రిలీజ్‌ డేట్‌ను తెలియజేస్తూ నిర్మాణ సంస్థ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. గ్రాఫిక్స్‌ ప్రధానంగా రూపొందుతున్న చిత్రం కావడం వల్ల రెండేళ్లగా వర్క్‌ జరుగుతూనే ఉంది. హడావిడిగా విడుదల చేయాలని కాకుండా గ్రాఫిక్స్‌ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ప్రశాంత్‌ వర్మ ముందుకెళ్తున్నారు. దాదాపు ఆ పనులన్నీ పూర్తి కావొచ్చినట్లున్నాయి. దాంతో విడుదల తేదీని ప్రకటించారు

అయితే వచ్చే సంక్రాంతికి చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. పైగా అన్నీ భారీ చిత్రాలే! ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ను జనవరి 12న రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. మహేశ్‌ ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్‌’ పండగ బరిలోనే ఉన్నాయి. విజయ్‌ దేవరకొండ-పరశురామ్‌ సినిమా, పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’, చిరంజీవి-కల్యాణ్‌ కృష్ణ కలయికలో రూపొందుతున్న చిత్రాలు సంక్రాంతి సీజన్‌ మీదే కన్నేశాయని తెలుస్తోంది. మరి ఇన్ని చిత్రాల మధ్య ‘హనుమాన్‌’ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. అయితే ప్రశాంత్‌ వర్మ మాత్రం ఈ చిత్రం విషయంలో బలమైన నిర్ణయంతో ఉన్నారు. ప్రొడక్ట్‌ మీదున్న నమ్మకంతో భారీగానే విడుదల ప్లాన్‌ చేశారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఇంగ్లిష్‌, స్పానిష్‌, కొరియన్‌, చైనీస్‌, జపనీస్‌.. ఇలా 11 భాషల్లో విడుదల చేయాలని ముందే ప్లాన్‌ చేసుకున్నారు. తేజ సజ్జా, అమృత అయ్యర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *