Bharatha Sakthi

కనిపించని సోయం..

admin 26/06/2023
Updated 2023/06/26 at 9:36 AM

అదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావ్‌ ఈమధ్య సొంత పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో ఎవరో కావాలనే తనను టార్గెట్‌ చేస్తున్నారన్నది ఆయన అభిప్రాయం. ఎంపీ లాడ్స్‌ నిధుల్ని వ్యక్తిగత అవసరాలకు ఖర్చు పెట్టుకున్నట్టుగా పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడిన వీడియో రచ్చకెక్కింది. సోషల్‌ విూడియాలో వైరల్‌ కావడంతో క్లారిటీ ఇచ్చే క్రమంలో అది సొంత పార్టీ నేతల కుట్ర అంటూ బాంబ్‌ పేల్చారు బాపూరావు. అంతేకాదు సోయం బాపురావ్‌ పార్టీ మారతారంటూ? తెగ ప్రచారం అయిందట. తన కుమారుడి పెళ్ళి కార్డు ఇవ్వడం కోసం ఆ మధ్య పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలిశారట ఎంపీ. దాంతో కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తారంటూ అప్పుడే కొన్ని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై స్పందించిన ఎంపీ పార్టీ మార్పు ఉండబోదని ఖండిరచారు. బీజేపీలో కొందరు తనను టార్గెట్‌ చేస్తున్నారన్న అనుమానం అప్పట్నుంచి ఆయన్ని వేధిస్తోందట. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పెట్టిన విూటింగ్‌లో నిధుల విషయాన్ని ప్రస్తావించారు. ఎంపీలాడ్స్‌ నిధుల్ని తన ఇంటి నిర్మాణానికి, కుమారుడి పెళ్ళి ఖర్చుల కోసం వాడుకున్నానని అన్న మాటలు బయటికి లీకై రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ అయింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అంతర్గత విషయాలను కొంతమంది బిజెపి నాయకులు కుట్రపూరితంగా బయట పెట్టి వీడియోను మార్ఫింగ్‌ చేసి తన పరువు తీస్తున్నారంటూ ఆ ఎపిసోడ్‌ విూద ఫైరయ్యారు బాపూరావు. బీజేపీ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌, మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ లే ఇలాంటి కుట్ర చేస్తున్నారని పేర్లు కూడా చెప్పాశారాయన.ఆదివాసీ నాయకుడిగా పేరున్న సోయం మొన్నటి వరకు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తుడుందెబ్బ తన మాట వినకుండా బరిలో ఉండడంతో విభేదాలు వచ్చాయి. తర్వాత సోయం ఆదివాసీ హక్కుల పోరాట సమితి నుంచి బయకొచ్చారు. ఈ క్రమంలోనే ఎంపీ లాడ్స్‌ నిధుల వ్యవహారం రచ్చ అయినట్టు తెలిసింది.ఎంపీ లార్డ్స్‌ రచ్చ పార్టీలో అలా కొనసాగుతుండగానే?.ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. కానీ? ఆ టూర్‌లో ఎక్కడా ఎంపీ కనిపించకపోవడంతో కొత్త చర్చ మొదలైంది. ఇటీవల మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వచ్చారు. ఆ సభకు రమేష్‌ రాథోడ్‌, పాయల్‌ శంకర్‌ హాజరయ్యారు గానీ.. బాపూరావు జాడ కనిపించలేదు. అదేంటని అడిగితే తన పరిధి కాదు కాబట్టి.. రాలేదని సమర్థించుకున్నారట. ఇద్దరు ముఖ్య నేతల పర్యటనల్లో కనిపించకపోవడం, ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో కేవలం బోథ్‌ నియోజకవర్గంలోనే తిరగడం చర్చనీయాంశమైంది. ఇతర బీజేపీ నాయకులతో సైతం అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారట. దీంతో ఎంపీ బాపూరావు బీజేపీలోనే ఉంటారా? లేక పార్టీ మారతారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.ఏది ఏమైనా ఎంపీ లాడ్స్‌ నిధుల వాడకం వ్యవహారం తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిందంటున్నారు. సోయం బాపూరావు రేవంత్‌ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి ఆయన తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళిపోతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీ నేతలు ఆయన్ని పొమ్మనలేక పొగబెడుతున్నారా ? లేక ఎంపీ వెళ్ళిపోవాలని డిసైడయ్యాక ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ నేతల్ని టార్గెట్‌ చేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. ఏది నిజమో తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *