Bharatha Sakthi

డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం – రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపిఎస్

Bharath Sakthi 02/01/2024
Updated 2024/01/02 at 6:42 AM

(శ్రీనివాస్ చింతలపాటి, భారత శక్తి ప్రత్యేక ప్రతినిధి)

రాచకొండ సీపీ సుధీర్ బాబు ips ఆధ్వర్యంలో ఈరోజు మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ 15 గ్రామాలలో 136 సీసీ కెమెరాలు ప్రారంభించారు. మారుమూల ప్రాంతం అయినప్పటికి మంచాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, పెద్దలు తమ బాధ్యతను గుర్తు ఎరిగి సమాజంలో నేను సైతం అన్నట్టుగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం, వారి బాధ్యతను గుర్తు ఎరిగి పోలీసులు ఇంకా డెడికేషన్ తో ప్రజా సేవ చేయాలని స్ఫూర్తిని ఇచ్చారు. అనంతరం స్ఫూర్తినిచ్చినందుకు రాచకొండ పోలీస్ కమీషనర్ వారిని అభినందించడం జరిగింది.
ఈ సీసీ కెమెరాల ఏర్పాటులో యువత యొక్క భాగస్వామ్యం కూడా ఉన్నందుకు వారిని కూడా అభినందించడం జరిగింది.

డ్రగ్స్ ఫ్రీ రాచకొండ కమీషనరేట్ గురించి CP మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని రాచకొండ పోలీసులు కఠినంగా నిర్వర్తిస్తామని డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతామని డ్రగ్స్ కు సంబంధించిన నేరగాలను కఠినంగా శిక్షిస్తామని, ప్రజలు తమ బాధ్యతగా డ్రగ్స్ పై మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉన్న రాచకొండ పోలీస్ whatsapp No: 8712662111 కు సమాచారం అందించాలని కోరడం జరిగింది.

రాచకొండ పరిధిలో రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్న ప్రదేశాలను(Block spots) గుర్తించి వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రణాళికలతో ముందుకు వెళ్తామని తెలియజేయడం జరిగింది.

సైబర్ నేరాల గురించి యువత విద్యార్థులు ప్రజలు అందరు కూడా వీటిపై మంచి అవగాహన కలిగి ఉండి, సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది.

ఇట్టి సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, మరియు ప్రజలకు రాచకొండ పోలీస్ కమీషనర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

Share this Article