Bharatha Sakthi

లగ్జరీ కార్ దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తున్ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీసులు

Updated 2023/06/30 at 6:47 PM

గత సంవత్సరం మే-2022 లో గచ్చిబౌలి లోని Zero-40 పబ్ నుండి ఒక BMW X5 కార్ ను మరియు తేది 24-06-2023 నాడు రాత్రి సమయములో బౌల్డర్ హిల్స్ నందు నిర్వహించిన బాద్షా మ్యూజికల్ ఈవెంట్ లో వాలెట్ పార్కింగ్ చేస్తానని నమ్మించి అక్కడకు ఈవెంట్ కు వచ్చిన మహిళ నుండి BMW Z4 కార్ ను దొంగతనం చేసిన నేరస్థున్ని గచ్చిబౌలి PS క్రైమ్ సిబ్బంది మరియు CCS మాదాపూర్ సిబ్బంది కలిసి ఈ రోజు తేది 30.06.2023 నాడు ఉదయం 08:00 గంటల సమయములో షెరటాన్ హోటల్ యొక్క B2 పార్కింగ్ ప్లేస్ లో పట్టుకొని అతని నుండి BMW Z4 మరియు అతని ఇంటి వద్ద నుండి BMW X5 కార్ అలాగే అతని సెల్ ఫోన్ ను స్వాదీన పర్చుకొనైనది.

ఇట్టి నేరస్థున్ని పట్టుకోవడానికి గచ్చిబౌలి PS క్రైమ్ సిబ్బంది మరియు CCS మాదాపూర్ సిబ్బంది ఎంతగానో శ్రమించినారు. ఇట్టి నేరస్థున్ని పట్టుకోవడానికి మరియు అతని నుండి దొంగతనం చేసిన కార్ లను రికవరీ చేయడానికి మాదాపూర్ DCP శ్రీమతి శిల్పవల్లి, మాదాపూర్ జోన్ Addl. DCP శ్రీ నంద్యాల నరసింహ రెడ్డి, సైబరాబాద్ క్రైమ్ Addl. DCP శ్రీ నరసింహ రెడ్డి గారి డైరెక్షన్ లో, మాదాపూర్ ACP శ్రీ Ch. రఘునందన్ రావు గారి పర్యవేక్షణలో, శ్రీ. జేమ్స్ బాబు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మరియు శ్రీ K. రవీందర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మరియు CCS మాదాపూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు గారి లీడర్షిప్ లో గచ్చిబౌలి క్రైమ్ సిబ్బంది మరియు CCS మాదాపూర్ సిబ్బంది నేరస్తున్ని పట్టుకొని అతని నుండి దొంగతనం చేసిన రెండు BMW కార్ లను రికవరీ చేయడం జరిగింది.

నేరస్థుడు బాగా బిజీగా వుండే పార్కింగ్ స్థలములో వాలెట్ పార్కింగ్ వద్ద వారిని మాటలలో పెట్టి వారిని నమ్మించి వారు కార్ కీ ఇచ్చే విధంగా చేసి అట్టి కార్ లను దొంగతనం చేయడం, అలాగే వాలెట్ పార్కింగ్ వ్యక్తిని అని కార్ ను వాలెట్ పార్కింగ్ చేస్తానని నమ్మించి కార్ పార్కింగ్ కు ఫోన్ లోనే కస్టమర్ డిటేల్స్ నమోదు చేసే కొత్త వాలెట్ పార్కింగ్ పేజ్ ని డమ్మీ దాన్ని సృష్టించి అతని ఫోన్ లోనే ఎంటర్ చేయించుకొని వారి కార్ కీ తీసుకొని కార్ తో అక్కడి నుండి పారిపోవడం, అట్టి దొంగతనం చేసిన కార్ లను ఎవరు ఉహించని స్థలములో పార్క్ చేసి కొన్ని రోజుల తర్వాత వాటి నంబర్ ప్లేట్ మార్చి తిరిగి దానిని తీసుకొని పోతాడు.
ఇట్టి కేసులను డిటెక్ట్ చేసి కార్ లను రికవరి చేసిన గచ్చిబౌలి క్రైమ్ సిబ్బందిని మాదాపూర్ DCP శ్రీమతి K. శిల్పవల్లి గారు, మాదాపూర్ జోన్ Addl. DCP శ్రీ నంద్యాల నరసింహ రెడ్డి, సైబరాబాద్ క్రైమ్ Addl. DCP శ్రీ నరసింహ రెడ్డి మరియు మాదాపూర్ ACP శ్రీ CH. రఘునందన్ రావు గారు అభినందించనైనది.

Share this Article