తాడ్వాయి/ములుగు జిల్లా ప్రతినిధి, (భారత శక్తి) : ఫిబ్రవరి 12 నుండి 15వ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని,
ప్రతి పని నాణ్యత పరిమాణంతో చేపట్టి శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మహా జాతర సందర్భంగా జరిగిన చిన్న చిన్న సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని మంత్రి సీతక్క మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పీ శభరీష్, ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల ద్వారా చేపట్టనున్న పనుల అంచనా వివరాలను మంత్రికి సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మినీ మేడం జాతరను పురస్కరించుకొని గత పక్షం రోజులుగా భక్తులు రాక పెరిగిపోయ