సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిదులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పిటిసి కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.