Bharatha Sakthi

స్కూల్ వాహనాలను తనిఖీ చేసిన నేన్నల్ ఎస్ఐ రాజశేఖర్

admin 27/06/2022
Updated 2022/06/27 at 2:23 PM

నేన్నెల్- T- రోడ్డు దగ్గర స్థానిక ఎస్సై ఎస్. రాజశేఖర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. మండలం లోని గ్రామాల నుండి మండల కేంద్రానికి మరియు బెల్లంపల్లి కి వెళ్ళే స్కూల్ వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారుల వద్ద పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా సరిఅయిన పత్రాలు లేని వారికి ఈ- చాలన్స్ విధించారు.
విద్యార్థులను స్కూల్ కి తరలించే వాహనాలు పరిమితికి మించిన విద్యార్థుల ను ఎక్కించు కొరదు. ఆటోలకు ముందు సీట్ లలో పిల్లలను ఎక్కించారాదు. స్కూల్ బ్యాగ్ లను ఆటోలకు ఇరువైపుల తగిలించకూడదు అని అతి వేగం వెళ్లరాదని, వర్ష కాలం లో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వెళ్లాలని, వాహనాల ఫిట్నెస్ కండిషన్ చెక్ చేసుకోవాలని సూచించారు. పరిమితికి మించి విద్యార్థులను వాహనాలలో తరలించరదని , స్కూల్ యాజమాన్యం వారు విద్యార్థులకు సరిపడా వాహనాలను సమకూర్చాలని తెలిపారు లేనియెడల వాహన యాజమానుల మీద మరియు స్కూల్ యాజమాన్య ల మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సూచించారు.

Share this Article