న్యూఢల్లీి, అక్టోబరు 13
పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాద సంస్థతో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఆ కార్యక్రమానికి ‘ఆపరేషన్ అజయ్ అనే పేరు పెట్టింది. ‘ఆపరేషన్ అజయ్’ అనే పేరుతో ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం లో భారత్ ఇజ్రాయెల్ కు మద్ధతుగా నిలిచింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ భారత ప్రధాని మోదీకి స్వయంగా ఫోన్ చేసి యుద్ధ పరిస్థితులను వివరించారు.విదేశీమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ కు తిరిగి రావాలని కోరుకుంటున్న భారతీయులను వెనక్కు తీసుకువస్తున్నారు. అందుకోసం ప్రత్యేక చార్టర్ విమానాలను ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ట్వీట్ చేశారు. గురువారం బయల్దేరే ప్రత్యేక విమానంలో భారత్ కు రానున్న ఇండియన్స్ కు మెయిల్ లో సమాచారం ఇచ్చామని టెల్ అవీవ్ లోని ఇండియన్ ఎంబసీ తెలిపిందిమరోవైపు, ఇజ్రాయెల్ లోని భారతీయులకు అవసరమైన సహాయ, సదుపాయాలు అందించడం కోసం 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ను భారత విదేశాంగ శాఖ ఏర్పాటు చేసింది. అలాగే, ఇజ్రాయెల్ లోని భారతీయ ఎంబసీ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్స్ ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ ` హమాస్ యుద్ధం గురువారానికి ఐదవ రోజుకు చేరింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు అధికారికంగా 2200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ ప్రత్యేకంగా ఎమర్జెన్సీ వార్ టైమ్ కేబినెట్ నుఏర్పాటు చేసి, యుద్ధ పరిస్థితులను సవిూక్షిస్తున్నారు.గాజా పై రాకెట్ల వర్షాన్ని ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది. హమాస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టణం పూర్తిగా ధ్వంసమైంది. భవనాలు కుప్పకూలాయి. మరణాల సంఖ్య తెలియడం లేదు. మొత్తంగా గాజా శిధిల నగరంగా మారింది. గాజా వైపు నుంచి కూడా హమాస్ ఇజ్రాయెల్ పై రాకెట్లను ప్రయోగిస్తోంది.
Leave a comment