గతంలో కంటే ఇప్పుడు తెలుగులో కొత్త కొత్త జోనర్లలో ప్రయోగాత్మక సినిమాలు చాలానే వస్తున్నాయి. అందులోనూ మల్టీస్టారర్‌గా వచ్చే చిత్రాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు కూడా అలా చాలా సినిమాలు తెలుగులో రూపొందుతోన్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో (BRO)’ ఒకటి. ఆరంభం నుంచే క్రమంగా అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మెగా హీరోల బ్రో టీజర్ ఎలా ఉందో మీరే చూసేయండి మరి!
బ్రో అంటూ వస్తున్నారు: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రమే ‘బ్రో (BRO)’. సముద్రఖని తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. దీనికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ‘వినోదయ సీతమ్’ అనే తమిళ సినిమాకు రీమేక్‌గా వస్తోంది.